ఇంటిలో ఎల్లప్పుడూ ఏదో ఒక అనారోగ్యంతో సాగిపోతే అభివృద్ధి కూడా అనారోగ్యమే గాని ఐశ్వర్యం కాదుగా
శ్రమించి సహించి సంపాదించిన ఐశ్వర్యమంతయు అనారోగ్యపు ఖర్చులకే పరిమితమైతే అభివృద్ధి కలిగేదెలా
కుటుంబం ఆరోగ్యంతో ఉన్నప్పుడే ఖర్చులు సాధారణమైన అవసరాలకే పరిమితమై పొదుపుతో అభివృద్ధి చెందవచ్చు
కుటుంబంలో నిరంతరం ఆరోగ్యం కలగాలంటే సమయానికి సమయోచిత కార్యాలను సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు ప్రకృతి ఆహార సామర్థ్యంతో విజ్ఞానంగా ఆలోచిస్తూ సక్రమంగా జాగ్రత్తగా సాగించాలి
తాత్కాలిక అనారోగ్యానికి ఇంటిలోని ఆహార పదార్థాలతోనే ఔషధంగా మార్చుతూ తగిన నియమాలతో సేవించాలి
పరిశుద్ధమైన ప్రకృతి పర్యావరణంలో జాగ్రత్తగా ఆలోచిస్తూ విజ్ఞానంగా జీవిస్తూ సాగిపోతే ఆరోగ్యంతో పాటు ఐశ్వర్య వంతమైన అభివృద్ధి కూడా పుష్కలంగా లభిస్తుంది
-- వివరణ ఇంకా ఉన్నది!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
Reveal your opinion