13, అక్టోబర్ 2026, మంగళవారం

ఒకరి అసమర్థతను చెప్పుకోవాలంటే ధైర్యం కావాలి

ఒకరి అసమర్థతను చెప్పుకోవాలంటే ధైర్యం కావాలి  
ఒకరి అసమర్థతను చెప్పుకోవడం సులభం ఆ తర్వాత జరిగే కార్యాలే ఇబ్బందులను కలిగించే పోరాటం 

అసమర్ధతతో ఉన్న వారికి తెలిస్తే చెప్పినవ వారిని ముప్పుతిప్పలు పెట్టేస్తారు వారి అసమర్థతను కూడా చేసిన కొన్ని కార్యాలనే ఎంతో సమర్థంగా గొప్పగా చెప్పుకుంటారు మనల్నే వంచేస్తారు మన కుటుంబ విధానాన్నే అగౌరవ పరుస్తూ హేళన చేస్తూ సరిగ్గా లేరని ఎత్తి చూపిస్తారు ప్రతి విషయానికి దానినే గుర్తు చేస్తుంటారు - దీని వలన ఒకరి అసమర్థతను మనం అస్తమించే దాక మనలోనే ఉంచుకోవాలి వీలయితే మరచిపోవాలి మనలోనే దాచుకోవాలి లేదంటే బంధాలే విడిపోతాయి సంబంధాలే దూరమవుతాయి కార్యములే మారిపోతాయి 

నీకు ధైర్యం విజ్ఞానం ఐశ్వర్యం సామర్థ్యం సహనం ఉంటే ఒకరి అసమర్థతను సమర్థంగా మార్చే కార్యాలను కలిగించేలా లేదా వారికి నచ్చిన ఉద్యోగ సంపాదనను వారి దారిలోనే తెలివిగా నైపుణ్యంతో కలిగించాలి అప్పుడే మనకు కూడా మనఃశాంతి లభిస్తుంది ప్రశాంతంగా ఉంటుంది లేదంటే ప్రతి రోజు అసమర్థతను గుర్తు చేసుకుంటూ బాధ పడుతూ శ్రమిస్తూ అనారోగ్యంతో అజ్ఞానంతో జీవిస్తూ సాగిపోవాలి వారికి సేవ చేసుకుంటూ ఉండాలి  


-- వివరణ ఇంకా ఉన్నది!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Reveal your opinion