ఒక బంధం క్రొత్తగా ఏర్పడితే అభివృద్ధి చెందాలి గాని అనాభివృద్ధి చెందకూడదు
బంధం అంటేనే క్రొత్తగా జీవించుటలో ఎన్నో కార్యాలు ఎన్నో అవసరాలు ఎన్నో సౌకర్యాలు ఎన్నో విధాలా ఖర్చులతో సాగిపోతాయి
ఖర్చులను భరించాలంటే శ్రమిస్తూనే సంపాదన చేస్తూనే జీవిస్తూ సాగిపోవాలి
ఇద్దరు ఒక బంధమై జీవించుటలో ఇద్దరూ సంపాదన చేస్తేనే కొత్త కార్యాలు సమస్యలు అవసరాలు సౌకర్యాలు ఇతర కార్యక్రమాలు అనుబంధాలు ఇరువురి కుటుంబాలు పొందే విషయాలు పరిష్కారమవుతూ సక్రమంగా సాగిపోతాయి
సంపాదన ఐశ్వర్యం లేకపోతే అన్నీ కార్యాలు సమస్యలుగానే మిగిలిపోతూ మరిన్ని సమస్యలు తోడవుతూ పెరుగుతూనే ఉంటాయి ఇబ్బందులు కలుగుతూనే ఉంటాయి జీవించుటకు శరీరం కూడా సహకరించక సహనం సామర్థ్యాన్ని కోల్పోతూ శ్రమించలేక అనారోగ్యంతో జీవితం అయోమయంగా అవస్థల పరిస్థితులతో సాగిపోతుంది
ఒక క్రొత్త బంధానికి కావలసినవి: విజ్ఞాన ఆలోచనలతో ఆచరణతో సమయోచితంగా ప్రధానమైన అవసరాలను సాధనతో శ్రమిస్తూ అభివృద్ధితో పొందాలి
అనుభవంతో కలిగిన వయస్సు అహం లేని మనస్సు
సమయోచితమైన ఆలోచన ఉత్తేజవంతమైన కార్యక్రమ కార్యాచరణ
అనుభవంతో కూడిన కార్యజ్ఞానం కాలజ్ఞానం లోకజ్ఞానం భవిష్యజ్ఞానం
పరిశుద్ధత ప్రశాంతత శ్రమించడం శరీర సామర్థ్యాన్ని పెంచుకోవడం
సహనంతో పాటు శ్రద్ధ పట్టుదల లక్ష్య సాధన స్వయంకృషి కార్యాలోచన
పరిశోధన ప్రజ్ఞానం పరిశీలన ప్రాముఖ్యత ప్రధానమైన అవసరాల ఎంపిక
విశ్రాంతి ఆరోగ్యం పర్యావరణం అనుబంధం ఆత్మీయత ఆదర్శవంతం
పొదుపు సంపాదన భవిష్య నిర్మాణం స్వగృహ ప్రవేశం పవిత్రమైన ప్రభావితం
ప్రకృతి ఆహారం ఆనందం కార్య నియమం రక్షణ సమానత్వం సమైక్యత
-- వివరణ ఇంకా ఉన్నది!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
Reveal your opinion