మిత్రమా! సమాజం ఎప్పటి నుండో మేల్కొనే ఉన్నది
నీవు శ్రమించడమే ఆలస్యం సంపాదన చేయడమే ప్రధానం
జన సంఖ్య ఎప్పుడైతే పెరిగిందో అప్పటి నుండి సమాజం వివిధ కార్యాలతో ప్రయాణాలతో రాత్రి పగలు అహర్నిశంగా మేల్కొనే కాలంతో నిరంతరం ఎందరితో ఎన్నో విధాలా ఎన్నో ప్రదేశాలలో సాగిపోతున్నది
సూర్యోదయం వరకు నిద్రించే కాలం వెళ్ళిపోయింది వేచియుండే సమయం ఎప్పుడో వెళ్ళిపోయింది
సూర్యోదయానికి మునుపే నీవు సమాజంలో ప్రవేశించాలి విజ్ఞానంతో సంపాదన చేసుకుంటూ సాగిపోవాలి
ఎంత ఆలస్యంగా సమాజంలో ప్రవేశిస్తే అంత తక్కువగా సంపాదన చేసుకుంటూ సమస్యలతో సాగిపోతావు
ఎంత త్వరగా సమాజంలో ప్రవేశిస్తే అంత త్వరగా తక్కువ కాలంలో ఎక్కువ సంపాదన చేసుకుంటూ సాగిపోగలవు
ఎక్కువ సంపాదన చేసుకుంటే ఎక్కువ ఐశ్వర్యం కలుగుతుంది సమస్యలు పరిష్కారించబడుతాయి అవసరాలు తీరిపోతాయి సౌకర్యాలు కలుగుతాయి ఆహారం ఆరోగ్యం విజ్ఞానం సామర్థ్యం అనుబంధం అభివృద్ధి చెందుతాయి
తక్కువ సంపాదన చేసుకుంటే సమస్యలు తీరకుండానే పెరుగుతూ వస్తాయి ఇబ్బందులను అనారోగ్యాన్ని అవస్థలను కలిగిస్తాయి అజ్ఞానాన్ని అజాగ్రత్తలను కొనసాగిస్తాయి సహనాన్ని సామర్థ్యాన్ని తగ్గిస్తాయి వేధిస్తాయి
ఎవరికంటే ఎందరికంటే ముందుగా మేల్కొని సంపాదన ప్రారంభిస్తావో వారికంటే వారందరికంటే ముందుగా ఐశ్వర్యవంతుడవుతావు ప్రయోజనకరుడవవుతాయి మార్గదర్శకుడవుతావు శ్రేయోభిలాషిగా సాగుతూ జీవిస్తావు
సమాజంలో ఉత్పత్తులు ఉన్నాయి వ్యాపారాలు ఉన్నాయి విజ్ఞాన చదువులు ఉన్నాయి విభిన్న కార్యాలు ఉన్నాయి వైద్య సేవలు ఉన్నాయి సమీప దూర ప్రయాణాలు (మానవులు వస్తువులు యంత్రాలు పదార్థాలు) ఉన్నాయి
-- వివరణ ఇంకా ఉన్నది!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
Reveal your opinion