నీ జీవన విధానం ఎలా ఉన్నా నీ హృదయం నీతోనే జీవిస్తూ సాగుతున్నది
నీ కార్యములకు తోడుగా సహకరిస్తూ నీ కోసమే ఆర్భాటం చెందుతూ జీవిస్తున్నది
హృదయం ఎంత ప్రశాంతగా జీవిస్తుందో నీతో అంత కాలం సాగుతూనే ఉంటుంది
హృదయం సంతోషంగా శ్రమిస్తున్నంత వరకు మేధస్సు ఉత్తేజంగా ఆలోచిస్తూనే ఉంటుంది
శరీర ఆరోగ్యం ఉన్నంత వరకు మేధస్సు విజ్ఞానంతో నీ కార్యాలు గొప్పగా సాగుతూ నీ జీవన విధానాన్ని మెరుగుపరుస్తాయి
నీవు జీవించుటలో నీ ఎదుగుదలకు నీ హృదయం ఎప్పుడూ నీకు సహకరిస్తూనే ఉంటుంది
-- వివరణ ఇంకా ఉన్నది!
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి
Reveal your opinion