జీవించుటలో శ్రమ సంపాదన విజ్ఞానం అవసరం లేనంతగా జీవిస్తున్నావంటే జన్మించుటకు ముందే ఐశ్యర్యవంతుడవై ఉంటావు
పుణ్యవంతుడవై కారణ జన్మను పొందుతూ జీవించుటలో ఎదుగుతూ జన్మార్థాన్ని తెలుసుకోవాలి మహా కార్యాన్ని (కార్యాలను) సాగించాలి
జీవించుటలో శ్రమ సంపాదన విజ్ఞానం అవసరమై ఉన్నా అన్నీ సౌకర్యాలు సంపద కార్యాక్రమాలు ఎటువంటి శ్రమ విజ్ఞానం లేకుండా సాగిపోతున్నాయంటే మానవుడు కంటే గొప్పవాడివిగా జన్మను పొందివున్నావని అర్థమవుతుంది
అన్నీ సౌకర్యాలు సంపద ఉన్నప్పుడు కావాల్సినవన్నీ సమకూర్చుకోవచ్చు ఎలాగైనా విలాసవంతంగా జీవించవచ్చు
రోజువారి కార్యాలలో మీకై సేవ కూడా చేసే విధంగా ఏ ఒత్తిడి లేని కార్యాన్ని కూడా చెప్పకుండా నీ వారు నిన్ను పోషించుటలో నీవు రాజులా మహారాణిలా జీవిస్తూ ఉండవచ్చు
సాధారణ మానవుడు కంటే రాజు కన్నా గొప్పవాడివిగా జీవిస్తున్నావంటే నీవు జీవించుటలో ఏదో పరమార్థం ఉందని లేదా ఆ పరమార్థం ఏదో తెలుసుకోవాలని జీవించు సమాజాన్ని ప్రపంచాన్ని ప్రశాంతంగా పరిశుద్ధంగా విజ్ఞానంగా పర్యావరణంగా విశాలంగా పంచభూతాలకు అనుగుణంగా ప్రజలు జీవించేలా మహా కార్యాలను ప్రారంభించు పరమాత్మగా ఆలోచించు మహా యోధుడిగా శ్రమించు నీకు లేని సమస్య ఇతరుల సమస్యలే నీవిగా భావించు మహోత్తముడిగా మహాత్ముడిగా మహర్షిగా జీవితాన్ని సాగించు అందరికి అభ్యున్నతిని కలిగించు
నేటి కాలంలో రాజు (రాణి) కన్నా గొప్పవారుగా శ్రమ సంపాదన విజ్ఞానం అవసరం లేనంతగా (సమస్యలు లేనట్లుగా శ్రమ తెలియనట్లుగా) తరగని ఐశ్వర్యంతో ఎందరో విలాసవంతంగా వివిధ రకాలుగా తెలియని జీవితంతో లక్ష్యం తెలియక జీవిస్తున్నారు
మహా ఐశ్వర్యవంతులందరు జీవిస్తున్న సమాజాన్ని పరిశుద్ధంగా ప్రశాంతంగా విజ్ఞానంగా తీర్చి దిద్దవచ్చు మహా సమాజ నిర్మాణాన్ని పరమార్ధంతో దైవ ప్రభావంగా సాగించవచ్చు
సమాజాన్ని విజ్ఞాన దైవాలయంగా మారచవచ్చు మనిషిని మహర్షిగా చూడవచ్చు మహాత్ములుగా జీవించవచ్చు
-- వివరణ ఇంకా ఉన్నది!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
Reveal your opinion