ఏ యంత్రంలో ఏ మంత్రం ఉందో ఏ మేధస్సుకు తెలుస్తుందో
ఒక్కొక్క యంత్రం ఒక్కొక్క విధంగా పని చేస్తుంది
యంత్రం యొక్క పని తీరు విధానమే విజ్ఞాన మంత్రం
యంత్రాన్ని తయారు చేసే వారికే ఆ యంత్ర మంత్ర విజ్ఞానం తెలుస్తుంది
యంత్రాన్ని తయారు చేసే వారికి ఆ యంత్ర భాగాల అమరిక (యంత్రానికి కావలసిన భాగాలు అలాగే యంత్రాన్నీ అమర్చుటకు కావలసిన పరికరాలు పనిముట్లు) మరియు పని తీరు మరియు మరమ్మత్తు విధానం తెలుస్తుంది
యంత్రాన్ని కనుగొన్న వారు సృష్టించిన వారు ఎన్నో ప్రయోగాలను చేసివుంటారు
యంత్రం అనుకున్న విధంగా పని చేయగలిగేందుకు ఎన్నో ప్రయోగాలు ఎన్నో విధాలా ఆలోచించి శ్రమించి విజ్ఞాన అనుభవాలను గ్రహించి ఉంటారు
యంత్రం యొక్క పని తీరు మంత్రం తెలిస్తే యంత్రాన్ని ఉపయోగించుకోవచ్చు వృత్తిగా చేసుకొని సంపాదన చేసుకోవచ్చు సౌకర్యం చేసుకోవచ్చు శ్రమ సమయాన్ని తగ్గించవచ్చు కార్యాలను సులభం చేసుకోవచ్చు
యంత్రం యొక్క మరమ్మత్తు విధానం విజ్ఞానంగా తెలిస్తే యంత్రం పని తీరును మళ్ళీ సరి చేయవచ్చు సంపాదన చేసుకోవచ్చు వృత్తిగా మార్చుకోవచ్చు
నేడు మహా యంత్రాలను తయారు చేసేందుకు నిర్మించేందుకు మరో యంత్రాలు కావలసి వస్తుంది
నేటి కాలమున ఎన్నో యంత్రాలు ఎన్నెన్నో రకాలుగా ఎన్నెన్నో విధాలుగా సూక్ష్మ యంత్రం నుండి మహా యంత్రం వరకు సృష్టింపబడుతున్నాయి తయారు చేయబడుతున్నాయి ఉపయోగించబడుతున్నాయి
యంత్రం పని తీరులో కొన్ని భవిష్య అవసరాలకు ఉపయోగపడాలంటే ఆధునిక విజ్ఞానంతో కొన్ని మార్పులు చేస్తూ వివిధ రూపకల్పనలతో క్రొత్త యంత్రాలను నిర్మాణం చేస్తూ పాత యంత్రాలను ఉపయోగం లేకుండా చేస్తున్నారు
-- వివరణ ఇంకా ఉన్నది!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
Reveal your opinion