14, జులై 2019, ఆదివారం

ఎవరి మేధస్సు వారికే ఒక లోకం

ఎవరి మేధస్సు వారికే ఒక లోకం
ఎవరి మేధస్సు వారికే ఒక విశ్వం

మేధస్సులోని ఆలోచన అజ్ఞానాన్ని తొలగించే విజ్ఞానం 
మేధస్సులోని అన్వేషణ విజ్ఞానాన్ని వెలిగించే అనుభవం

మేధస్సులోని జ్ఞాపకమే సర్వాలోచనల విజ్ఞాన భండారం  || ఎవరి ||

మేధస్సులోని అనంతమైన విజ్ఞానం మరో చరిత్రకు వేదాంతం
మేధస్సులోని నిరంతరమైన విజ్ఞానం మరో చరిత్రకు పాఠాంశం

మేధస్సులోని నిత్యాంతరమైన విజ్ఞానం మరో కాలానికి ఆదర్శము
మేధస్సులోని సత్యాంతరమైన విజ్ఞానం మరో యుగానికి అధ్యాయం  || ఎవరి ||

మేధస్సులోని ఆలోచనల వైనం మరో తరానికి నవీకరణం
మేధస్సులోని ఆలోచనల విధం మరో జగానికి అపూర్వత్వం

మేధస్సులోని ఆలోచనల ప్రత్యేకం మరో జీవితానికి అద్భుతం
మేధస్సులోని ఆలోచనల ప్రత్యక్షం మరో దృశ్యానికి ఆశ్చర్యం  || ఎవరి || 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Reveal your opinion