ఏ జీవి తన జీవిత కాలంలో ఎటువంటి కార్యాలను నడిపిస్తుందో ఎవరికి తెలుసు
ఎప్పుడు ఏ జీవి ఏ కార్యాలతో ఏ ప్రదేశంలో ఏ భావాలతో జీవిస్తుందో ఎవరికి తెలుసు
ప్రయత్నములతో సాగే సాధనాలే మన కార్యాలను వివిధ రకాలుగా ముందుకు సాగిస్తాయి
కార్య ఫలితాలు కార్యాచరణ కార్యక్రమాల విధానాల ఆధారంగా కార్య కారణం ఏర్పడుతాయి
కొన్ని భవిష్య కార్యాలను ఏ జీవి తెలుసుకోదు ఎలా జరిగిపోతాయి ఊహించుటకు సమయాలు లేకుండా సాగిపోతాయి
చేస్తున్న కార్యాల ఆధారంగా కొన్ని కార్యాలను అవగాహనతో ఆలోచన గమనంతో అనుభవాల విజ్ఞానంతో భవిష్య కార్యాలను కొన్నింటిని గ్రహించవచ్చు
లక్ష్యాన్ని జయించుటలో కూడా కొన్ని భవిష్య కార్యాలను తెలుసుకోవాలి అందుకు కార్యక్రమ సాధన ప్రణాళికను ఏర్పాటు చేసుకోవాలి
-- వివరణ ఇంకా ఉంది!
No comments:
Post a Comment