మనది మనది అంటూ అనుకుంటూనే ఉంటే ఒకానొకప్పుడు [ఎప్పుడో ఒకప్పుడు] ఎవరికో వెళ్ళిపోతుంది
ఎప్పుడో ఒకప్పుడు మనదే మన నుండి వెళ్ళిపోతే మనదంటూ ఎప్పుడూ ఏముంటుంది [ఏదుంటుంది]
అలాగే నాది నాది అనుకుంటూ ఉంటే నిన్ను నీవే నీ దేహాన్ని ఎప్పుడో ఒకప్పుడు తెలిసి తెలియనట్లుగా అస్తమించిపోతావు అలాగే నీది నీవు అనుకున్నవన్నీ వదిలిపోతావు
అన్నీ అందరి నుండి వెళ్ళిపోతాయని మౌనంగా నిశ్చలంగా ఉండకూడదు నిరంతరం శ్రమిస్తూ మనకు కావలసిన వాటిని మనకు మన వాళ్ళ కోసం ఆరోగ్యం కోసం విజ్ఞానం కోసం ప్రకృతి పరిశుద్ధత అభివృద్ధి కోసం వినయంతో గౌరవంతో సంపాదించుకోవాలి సమపాలలో పంచుకోవాలి
-- వివరణ ఇంకా ఉంది!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి