ఒంటరిగా జీవిస్తున్నప్పుడే మన సామర్థ్యం తెలుస్తుంది
ఒంటరిగా జీవిస్తున్నప్పుడు మన ఆలోచన విధానాలు విజ్ఞానవంతంగా ధైర్యవంతంగా లక్ష్యంకై సాధన చేస్తూ సాధించేలా ఉండాలి
మనకు కావలసిన వాటిని మనమే సమకూర్చుకోవాలి ప్రతి కార్యంలో జాగ్రత్త వహించాలి ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండేలా ఆహార నియమాలు పాఠించాలి
సమాజంలో ఉన్నప్పుడు ఎక్కడ ఏ కారణం చేతనైన మోసపోరాదు
ప్రతి విషయాన్ని వివేకవంతంతో ఆలోచిస్తూ విజ్ఞానాన్ని గ్రహిస్తూ ముందుకు సాగాలి
మనకు ఉన్న సమస్యలు గుర్తుకు వస్తున్నప్పుడు ధ్యాసను విజ్ఞానం వైపు మార్చేస్తూ పరిస్కారాలను గ్రహించాలి
సమస్యలకు పరిష్కారాలు కొన్ని స్వల్ప కాలంలో మరికొన్ని అధిక కాలంలో మరికొన్ని అనుకోని కాలంలో సంభవిస్తాయి [సమస్యలు తీరిపోతాయి] కొన్ని సమస్యలు అలాగే మిగిలిపోతాయి
కొన్ని సమస్యలు పరిష్కారింపబడకపోతే నిరుత్సాహం చెందక వేరే సమస్యలుగా [కోరికలుగా] మార్చుకోవాలి
కొన్ని సమస్యలు ఇతరుల ద్వారా తీరిపోతాయి కొన్ని సమస్యలు ఇతరుల ద్వారా పెరుగుతాయి
కొన్ని సమస్యలకు అర్థాలు ఉండవు
విజ్ఞానవంతమైన ఉపయోగవంతమైన సమస్యలనే [కోరికలనే, లక్ష్యాలనే] ఎంచుకోవాలి
మనలోనే ఆలోచనల విధానంతో పాటు విజ్ఞానం పెరుగుతూ [అభివృద్ధి చెందుతూ] ఉండాలి ఐశ్వర్యవంతంగా ఆరోగ్యవంతంగా ఎదగాలి
-- వివరణ ఇంకా ఉంది!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి