కొందరికి దేవత (తల్లి) వరములు ఇస్తానని మరో విధంగా తెలుపుతున్నా తిరస్కరిస్తుంటారు
వరములు ఎవరైనా ఇవ్వచ్చు వాటిని సద్వినియోగం చేసుకుంటే భవిష్యత్ అభివృద్ధిని అన్ని విధాలా ఇస్తుంది (ఆరోగ్యం ఆహారం విజ్ఞానం ఆనందం ఐశ్వర్యం అనుబంధం సౌకర్యం అనుభవం ప్రఖ్యాతమైన ప్రగతి మొదలైనవి)
వరములను భాగ్యములుగా మార్చుకుంటూ నీవు ఇంకొకరికి వరములు ఇచ్చే విధంగా ఎదగాలి
వరములు తీసుకొనుటలో నీవు మరో విధంగా భావిస్తే భవిష్యత్లో వరములను స్వీకరించుటకు కూడా ఆరోగ్యం సహకరించకపోవచ్చు వరములు ఇచ్చేవారు కూడా లేకుండాపోవచ్చు అలాంటప్పుడు జీవితమంతా శ్రమతో కఠినంగా సాగుతుంది - కుటుంబం వెనుకబడి పోతుంది
వరములు సహాయములే గాని మరో విధంగా భావించకూడదు - వరములు జీవన కార్యములలో భాగమే
వారములు సుఖంగా అనిపించినా వాటిని సక్రమంగా ఉపయోగించుకుని ప్రయోజనాన్ని చూపించేలా ఎదగాలి
ఐశ్వర్యాన్ని పొదుపుగా చేసుకోవాలి గాని శ్రమను పొదుపు చేసుకోరాదు - పొదుపు ఐశ్వర్యాన్ని అభివుద్ధి చేస్తుంది పెంచుతుంది తరతరాలకు ఆనందాన్ని ఇస్తుంది సౌకర్యాలను కలిగిస్తుంది
శ్రమను పొదుపు చేసుకుంటే సోమరితనంతో పాటు అనారోగ్యం అజ్ఞానం అజాగ్రత్త అశుద్ధత కలుగుతాయి
-- వివరణ ఇంకా ఉంది!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
Reveal your opinion