Wednesday, April 29, 2026

జీవ హింసతో శాంతి కలుగుతుందని నమ్మకం

జీవ హింసతో శాంతి కలుగుతుందని నమ్మకం ఎంతటి ఆచరణమైన భ్రమయో బ్రంహకైనా ఆలోచన కలగలేదా 

పూర్వం నుండి ఆచరించే జీవ హింస ఏ మహాత్ముడు వరమిచ్చెనో తన భయానికి శాంతి కలుగుతుందని 

మానవ మేధస్సులో ఆలోచనలు ధైర్యమై అమోఘమైన శక్తి సామర్థ్యములు జీవించుటకు శాంతిని కలిగించవా 

మానవ జీవుల ప్రాణ విలువలకు ఇతర జీవుల ప్రాణాలనే బలి ఇచ్చుట ఎంతటి శాంతమో ఏ జీవికి తెలుసు 

అనారోగ్యంతో జీవించేవారికి అష్ట కష్టములు తొలగాలని జీవ హింస ఆచరణను సాగించుట ఎంతటి ఆరోగ్య విధానమే 

ఒక జీవిని రక్షించుకొనుటకు మరో జీవిని హింసించుట ఎంతటి సిద్ధాంతమో మహాత్ముడే గ్రహించాలి 

ఒక జీవి అనారోగ్యాన్ని తొలగించుటకు మరో జీవి ప్రాణాలను వదులుకోవాలా [ఔషధం లేదా]

ఒక కుటుంబ ఆరోగ్యం కోసం మరో జీవి ప్రాణం అవసరమా 

ఒక ఊరి శాంతం కోసం ఒక జీవి ప్రాణం అవసరమా 

ఔషధమే లేని అనారోగ్యం తొలగించుటకు మానవ మేధస్సుకు సాధ్యం కాదా కాలమే మార్గాన్ని చూపదా 

ఎటువంటి అనారోగ్యానికైనా మానవుని విజ్ఞాన వైద్య శాస్త్రం ఔషధం కోసం పరిశోధనతో  పరిష్కారాన్ని కనిపెట్టగలదని నేటి ఆధునిక యంత్ర ప్రయోగ విధానం తెలుపుతుంది 
(అనారోగ్యంతో భయపడితే ప్రాణాన్ని రక్షించు కొనుటకు జీవితాన్ని సాగించుటకు బంధాలతో జీవించుటకు జీవ హింస అవసరమా - అది ఎలా పనిచేస్తుంది దాని తర్క శాస్త్రం న్యాయ శాస్త్రం ఏమిటి - పంచభూతాల ప్రమేయం ఏమైనా ఉన్నదా)

గృహములకు భవనాలకు అంతస్తుల నిర్మాణములకు శాంతం కలగాలంటే జీవ హింస అవసరమా 

మానవ దేహం అనారోగ్యం (నయం కాని మనోగత విషాద పరిస్థితి) చెందినా మానవుడు దేనిని నిర్మించుకున్నా జీవ హింసతో శాంతి చేయడం ఆచరణగా నమ్మకంగా సాగుతున్నది రక్షణగా భావిస్తూ తరతరాలుగా కొనసాగుతున్నది  


-- వివరణ ఇంకా ఉంది!

No comments:

Post a Comment