తరిగించే శ్రమ కార్యములు లేనప్పుడు అరిగించే జీర్ణ ప్రక్రియములు ఎలా పని చేస్తాయి
తరగించే కార్య శ్రమ లేనప్పుడు ఆరగించే జీర్ణ ప్రక్రియములు నిదానముగా సాగుతాయి
జీర్ణ ప్రక్రియములు నిదానముగా సాగుటలో శరీరములో ఎన్నో అనారోగ్య సమస్యలు మొదలవుతాయి
ఆహారం జీర్ణం అవ్వడానికి ఔషధం శరీరం తగ్గడానికి ఔషధం ఆకలి అవ్వడానికి ఔషధం నిద్ర పోవుటకు ఔషధం ఇలా ఎన్నో సమస్యలు మొదలవుతాయి
మనిషి శ్రమించుటకు కూడా శక్తి సామర్థ్యములకై ఎన్నో ఔషధాలు అవసరమవుతాయి
ప్రతి విధమైన కార్యానికి ఒక్కొక్క రకమైన ఔషధం వేసుకుంటూ (తీసుకుంటూ) సాగితే మానవునిలో అనారోగ్యంతో పాటు శక్తి సామర్థ్యములు తగ్గిపోతూ జీవిత కాలం యొక్క ఆయుస్సు కూడా తగ్గిపోతుంది
సూర్యోదయంతో మేల్కోండి శ్రమించే విధానం తెలుసుకోండి ఆరోగ్యాన్ని వృద్ధి చేసుకోండి తగిన విశ్రాంతితో జీవిత కాలం యొక్క ఆయుస్సును పెంచుకోండి
ఎంతటి శ్రమ కార్యములు ఎన్ని ఉన్నా ప్రతి రోజు కొంత సమయమైనా శారీరక వ్యాయామం ఉదయం సాయంత్రం అవసరం
వ్యాయామం ద్వారా శరీరం సరైన స్థితిలో పనిచేస్తూ శరీరం మన కార్యాలకు అనుగుణంగా పనిచేస్తుంది అలాగే వివిధ రకాలుగా ఉదంచిత శ్రమ కార్యములలో ఉత్తేజంతో శరీరాన్ని పలు విధాలుగా కదిలించడానికి వీలుగా సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది
-- వివరణ ఇంకా ఉంది1
No comments:
Post a Comment