అస్తమించుటచే (మరణించుటచే) శూన్యమై పోయినా కేవలం స్పర్శతో ఉద్భవించగలవా (మళ్ళీ జన్మిస్తూనే ఉండగలవా)
మరణంతో శరీరం వెళ్ళిపోయినా మన ఆత్మ స్వభావం పరమాత్మ తత్త్వంతో ప్రకృతిగా ఉద్భవిస్తుంది
మన ఆత్మ విత్తనమై పంచభూతాల స్పర్శచే ప్రకృతిగా మొలకెత్తుతూ వృక్షమై పర్యావరణమై జీవిస్తుంది
మన ఆత్మ మన స్వభావ తత్త్వం విత్తనముగా (ఉండాలంటే) ఉద్బవించాలంటే ఆధ్యాత్మ పరమాత్మ ప్రభావాలచే పంచభూతాల విశ్వ విజ్ఞాన గమనంతో జీవించాలి
విత్తనంలో ఉన్న స్వభావ తత్త్వాలు పంచభూతాల స్పర్శచే జగతిలో (భూమిలో మట్టిలో) ఉద్భవిస్తాయి మొలకెత్తుతాయి
విత్తనం ఉన్నంతవరకు పంచభూతాలు వివిధ రకాలుగా ఉద్భవిస్తూ అవతరిస్తూనే ఉంటాయి జీవులకు పర్యావరణ ప్రాణాధార వాతావరణాన్ని పరిశుద్ధంగా అందిస్తూనే ఉంటాయి
-- వివరణ ఇంకా ఉన్నది!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి