2, ఆగస్టు 2026, ఆదివారం

భవిష్య వాణి జ్యోతిష్య వాణి తెలిసినా తెలియకపోయినా మేధష్య వాణి తెలియాలి

భవిష్య వాణి జ్యోతిష్య వాణి తెలిసినా తెలియకపోయినా మేధష్య వాణి తెలియాలి 
మేధష్య వాణి తెలిస్తేనే మన ఆలోచన గమనంతో మన కార్యక్రమ విధానం సాగిపోతుంది  

మన ఆలోచన మన ఇంద్రియములకు తెలుపుతూ మన శరీరాన్ని కార్యక్రమంగా సాగించాలి 
మన ఇంద్రియములు మన చుట్టూ ఉన్న ప్రాంత పరిస్థితులను కుటుంబాన్ని గమనిస్తూ మన జ్ఞాన స్థితి స్థాయిని బట్టి ఆలోచనలను కలిగిస్తూ కార్యక్రమాలను సాగిస్తుంది 

ఇంద్రియముల జ్ఞానం ప్రతి కొంత సమయానికి వృద్ధి చెందుతూ మన వయస్సును మన స్వభావ తత్త్వాలను మన ఆలోచన శక్తిని విజ్ఞాన అర్థ పరిణామాన్ని మార్చుతూ మేధాశక్తిని పెంచుతుంది కార్యక్రమాల అనుభవాలతో ఆలోచన విధానాన్ని అభివృద్ధి చేస్తుంది 

ఆలోచనలు అన్వేషిస్తూనే పరిశోధన చేస్తూ కార్యక్రమాలతో ఎన్నింటినో గమనిస్తూ కార్య జ్ఞానాన్ని పొందుతూ కార్య నైపుణ్యాన్ని పెంచుకుంటూ మేధస్సును మరింత సామర్థ్యంతో మార్చుకుంటూ కార్యక్రమాలను మరింత సౌఖ్యతగా సులభంగా ప్రశాంతంగా నమ్మకంగా ధైర్యంగా సాగిస్తుంది  

మేధష్య వాణితోనే మన కార్యక్రమాలను మనం జాగ్రత్తగా విజ్ఞానంగా పరిశుద్ధంగా రక్షణ స్వభావంతో సాగిస్తున్నాము చేసుకుంటున్నాము 

మేధష్య వాణి అంటే ఆలోచనలు తెలిపే కార్యం లేదా అర్థం లేదా జ్ఞానం లేదా గమనం లేదా విషయం లేదా ఇంద్రియముల పరిశోధన విచక్షణ స్వభావాల తత్త్వం పరిస్థితుల ప్రత్యుత్తరము కార్యాల అన్వేషణ మొదలైనవి 

-- వివరణ ఇంకా ఉన్నది!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి