1, ఆగస్టు 2026, శనివారం

ప్రపంచ వ్యాప్త పరిశ్రమల యజమాన్యమా అధికారమా మీరు ఇచ్చే జీతాలు ఆకలిని తీర్చటం లేదు

ప్రపంచ వ్యాప్త పరిశ్రమల యజమాన్యమా అధికారమా మీరు ఇచ్చే జీతాలు ఆకలిని తీర్చటం లేదు  

ప్రపంచ వ్యాప్తంగా అభివృద్ధి చెందిన పరిశ్రమల యజమాన్యమా క్రింది స్థాయి ఉద్యోగులకు తగినంతగా జీతాలు ఇస్తూ ఉద్యోగుల శ్రమను గుర్తించి వారి కుటుంబ జీవితాలను గమనించండి (పరిశ్రమలలో కొన్ని నియమాలను మార్చేస్తే ఎందరివో జీవితాలు సంతోషంగా మారిపోతాయి)

లక్షలలో ఉన్నవారు ఎలాగైనా జీవించగలరు వేలలో ఉన్నవారు జీవించలేక సతమతమౌతున్నారు 

మీరు ఇచ్చే జీతాలు శ్రమించుటలో కావలసిన శక్తి సామర్థ్యాలకు కావలసిన ఆహారానికి సరిపోవుట లేదు 

సమాజం అధిక ధరలతో కుటుంబం అనేక సమస్యలతో సాగిపోతుంటే జీతాలు కనీస అవసరాలకు సరిపోకుండా ఆకలిని పెంచుతున్నాయి శరీరాలు అనారోగ్యంతో సాగలేక సాగిపోతున్నాయి 

పరిశ్రమల నియమాలు లాభాల కోసమైనా కొంతవరకు ఉద్యోగుల భవిష్య జీవితాలకు కుటుంబ బాధ్యతలకు జీవన సమస్యల పరిష్కారాలకు జీతాలు సంతృప్తిని కలిగించటం లేదు 

సర్వేక్షణ పరీక్షణ ప్రతిపుష్టి విచారణల సమాచారములలో ఉద్యోగుల సంతృప్తికి కావలసిన ప్రశ్నలు లేవు  

ఉద్యోగుల కుటుంబాలు సంతోషంగా జీవించుటకు కావలసిన అవసరమైన జీతాలు సరిపోతున్నాయా లేదా అని అడిగే ప్రశ్నలు లేవు 

జీవితాలు బాగా ఉండాలంటే జీతాలలో విజ్ఞానం ఉండాలి 

జీ'వి'తాలు - వి లేకపోతే జీతాలు విజ్ఞానం లేకుండానే సాగిపోతాయి 
జీతాలను విజ్ఞాన జీతాలుగా ఉద్యోగుల జీవితాలకు సంతృప్తిని కలిగించేలా ఇవ్వండి 

ఉద్యోగులు సంతృప్తిగా ఉంటే ఉత్తేజంతో ఉత్సాహంతో ఆరోగ్యంతో శక్తి సామర్థ్యాలతో విజ్ఞానంతో శ్రమిస్తారు కుటుంబ బాధ్యతలను అవసరాలను సమస్యలను పరిష్కారిస్తూ సంతోషంగా జీవిస్తారు 


-- వివరణ ఇంకా ఉన్నది!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి