Friday, October 31, 2025

మరణిస్తూ మరణిస్తూ జీవితమంతా మరణిస్తూనే జీవిస్తున్నా

మరణిస్తూ మరణిస్తూ జీవితమంతా మరణిస్తూనే జీవిస్తున్నా 

అనారోగ్యం చెందుతూ చెందుతూ జీవితమంతా కాస్త కాస్త ఆరోగ్యాన్ని నింపుకుంటూ జీవిస్తున్నా  

శ్రమించుటలో అనారోగ్యం చెందుతూ ఆహారంతో విశ్రాంతితో నిద్రతో ఆరోగ్యాన్ని కాస్త నింపుకుంటూ దేహాన్ని శ్వాసతో సాగిస్తూ కుటుంబం కోసం జీవిస్తున్నా 

ఎందరో అనారోగ్యంతో జీవిస్తున్నా కుటుంబం కోసం ఆరోగ్యాన్ని కాస్త నింపుకుంటూ శ్రమిస్తూనే అభివృద్ధిని ఆశయం చేసుకుంటూ జీవిస్తున్నారు 

ఆరోగ్యంతో శ్రమించండి అభివృద్ధికై జీవించండి ప్రకృతిని రక్షించండి అన్ని విధాలా విజ్ఞానాన్ని గ్రహించండి  


-= వివరణ ఇంకా ఉంది!

ఏ భావ తత్వాలతో మరణాన్ని గుర్తించెదవు

ఏ భావ తత్వాలతో మరణాన్ని గుర్తించెదవు ఎలా గ్రహించెదవు ఎలా తెలిపెదవు ఎలా తొలగించుకొనెదవు  
ఏ భావ తత్వాలతో మరణాన్ని గుర్తించినా శ్వాసపై ధ్యాసతో గమనం ఉంచితే కాస్త ఊరట కలుగుతుంది 

మరణం సంభవిస్తున్నా దేహపు అనారోగ్యాన్ని అస్థ వ్యవస్థను మహోదయమైన భావ తత్వాలతో శ్వాస ప్రయాస ప్రభావంతో ఆరోగ్యాన్ని పొందుతూ కొంత సమయం కొంత కాలం జీవించవచ్చు 

జీవించుటలో కొన్ని జాగ్రత్తలు కొన్ని నియమాలు పాఠిస్తే ఆరోగ్యంతో ఎక్కువ కాలం జీవించవచ్చు అనారోగ్య మరణాన్ని తొలిగించుకోవచ్చు 

దేహాన్ని వివిధ ప్రమాదాల నుండి రక్షించుకోవాలి అలాగే దేహానికి సరైన సమయానికి ప్రశాంతమైన నిద్ర సామర్థ్యమైన విశ్రాంతి పరిశుద్ధమైన ప్రకృతి ఆహారం ఉండాలి అవసరమైన శ్రమయం ఉండాలి 
దినసరి కార్యాలతో తగిన వ్యాయామం శరీరానికి తగిన విధంగా చేయాలి సమస్యలను పరిష్కారించే విజ్ఞానం ఉండాలి 

సూర్యోదయాన ప్రతి రోజు ఉత్తేజవంతమైన ఆలోచనలు మెళకువలు దినచర్య కార్యక్రమాలు సాగేలా ఉండాలి అభివృద్ధిని సాధనతో అందుకోవాలి సద్గుణమైన అలవాట్లను అలవర్చుకోవాలి గుణవంతుడిగా సత్ప్రవర్తనతో జీవించాలి క్రమశిక్షణతో జీవితాన్ని మెరుగుపరుచుకోవాలి 


-- వివరణ ఇంకా ఉంది!

శరీరంలో జరిగే ప్రతి ప్రక్రియ ప్రతి అవయవానికి తెలుస్తుంది

శరీరంలో జరిగే ప్రతి ప్రక్రియ ప్రతి అవయవానికి తెలుస్తుంది  

శరీరంలో ఏ ప్రక్రియ సరిగ్గా సాగలేక పోయినా అన్ని అవయవాలకు తెలుస్తుంది అనారోగ్యాన్ని గుర్తిస్తుంది మేధస్సు గ్రహిస్తూ తెలియపరుస్తుంది (తెలుసుకుంటుంది)

ఒక అవయవం సరిగ్గా పనిచేయలేక పోయినా ఇతర అవయవాలు గుర్తించి వాటి బాధను ఇబ్బందిని మేధస్సు ద్వారా శరీరానికి తెలుపుతుంది 

ఒక అవయవం ద్వారా మరో అవయవానికి కూడా ఇబ్బంది బాధ నొప్పి కలుగుతుంది అలాగే మేధస్సుకు తెలుస్తుంది 

ఏ అవయవం సరిగ్గా ప్రక్రియ జరిగించలేకపోయినా శరీరానికి విశ్రాంతి అవసరం దానిని మేధస్సు గుర్తించడం చాలా ముఖ్య అవసరం తగిన జాగ్రత్తలు చికిత్సలు తీసుకోవడం ఆరోగ్య నియమాలు పాఠించడం ప్రధానం 

శరీరానికి సరైన నిద్ర విశ్రాంతి ఆహారం శ్రమించే విధానం శ్రమించే నైపుణ్యం శ్రమించే సమయం (సూర్య సమయం) చాలా అవసరం అలాగే నడక వ్యాయామం పరిశుభ్రత పరిశుద్ధమైన దిన చర్య సిద్ధాంతం ప్రధానం పాఠించాలి 

-- వివరణ ఇంకా ఉంది!

ఎటువంటి విజ్ఞానం చెందుటకైనా సూర్యుడు తోడుగా ఉంటాడు

ఎటువంటి విజ్ఞానం చెందుటకైనా (పొందుటకైనా) సూర్యుడు ఎల్లప్పుడూ తోడుగా ఉంటాడు  

సూర్యుని ప్రకాశంతోనే మేధస్సులో ఉత్తేజవంతమైన ఆలోచనలు లక్ష్యాన్ని సాధించుటకు సహకరిస్తాయి 

సూర్య సమయం ఎల్లపుడూ శక్తి సామర్థ్యాలతో  ప్రతి జీవికి కార్య ప్రయోజనమై ఉపయోగపడుతుంది  
  

-- వివరణ ఇంకా ఉంది!

Thursday, October 30, 2025

విశ్వంలో ప్రతి అణువు పరిశుద్ధమైతే మరణం శూన్యమే

విశ్వంలో ప్రతి అణువు పరిశుద్ధమైతే మరణం శూన్యమే  

ప్రతి అణువు పరిశుద్ధమైతే సంపూర్ణమైన ఆరోగ్యంతో ఎల్లప్పుడూ జీవిస్తూనే ఉంటుంది 
జీవుల శరీరాలు కూడా ఎల్లప్పుడూ పరిశుద్ధంగా ఉంటే నిరంతరం ఆరోగ్యంతో జీవిస్తూనే ఉంటాయి 
ప్రకృతి జీవిస్తున్నట్లు జీవులు కూడా ధీర్ఘ కాలంగా సాగవచ్చు 

ప్రకృతికి ఆహారం ప్రకృతియే విశ్వ కార్యాలతో సమకూర్చుకుంటుంది సుధీర్ఘమైన శక్తి సామర్థ్యాలతో జీవిస్తుంది 
జీవుల ఆరోగ్యం పరిశుద్ధంగా తగ్గుతున్నా ఎంతో కాలంగా (శతాబ్దాలుగా) స్వచ్ఛమైన ప్రకృతి ప్రభావాలతో వివిధ శక్తి సామర్థ్యాలతో జీవించవచ్చు 


-- వివరణ ఇంకా ఉంది!

 

సూర్యోదయంతో విశ్వమంతా మహోదయమైన అనంతమైన దివ్యమైన ఔషధాలు ప్రకృతి ప్రభావాలతో విస్తరించుకుంటాయి

సూర్యోదయంతో విశ్వమంతా మహోదయమైన అనంతమైన దివ్యమైన ఔషధాలు ప్రకృతి ప్రభావాలతో విస్తరించుకుంటాయి 

ఔషధములన్నీ కాల సమయంతో పాటు పంచభూతాల ప్రభావాలతో విశ్వ ప్రదేశమంతా వ్యాపిస్తూ ఉంటాయి 

మహోదయమైన ఔషధాలు జీవులన్నింటికీ శక్తి సామర్థ్యాలను అందిస్తూ అద్భుతమైన కార్యాలను ఆరోగ్యంతో సాగిస్తూ జీవన విధానాన్ని మెరుగుపరుస్తాయి బంధాలను అభివృద్ధి చేస్తాయి 

సూర్యోదయంతో ఏర్పడే ఔషధాలు ప్రకృతిలో వివిధ పరిణామాలతో వివిధ ప్రభావాలతో అభివృద్ధి చెందుతూ జీవులకు వివిధ గుణాల స్వచ్ఛమైన నిర్మలమైన ప్రాణ వాయువులను అందిస్తుంది 

సూర్యోదయ కాంతి తేజస్సుతో ప్రకృతి వివిధ ప్రక్రియలతో ఎదుగుతూ వికసిస్తూ నిర్మలమైన స్వచ్ఛమైన పరిమళమైన సుగంధాలను ప్రాణ వాయువులతో మిశ్రమం చేస్తూ జీవులకు ఆరోగ్యాన్ని ఉత్తేజాన్ని పరిశుద్ధమైన ప్రభావాలతో అందిస్తుంది 

సూర్య ప్రకాశంతో విశ్వం నిర్మలమై ఆకాశ ప్రదేశమంతా మహోదయమై జీవులకు ఉత్తేజాన్ని కలిగిస్తూ మేధస్సుకు నవ భావ తత్వాలను కలిగిస్తూ వివిధ కార్యాలను సాగించేందుకు సహకరిస్తుంది 


-- వివరణ ఇంకా ఉంది! 

రేపటి సూర్యోదయం కోసం జీవిస్తూ ఉండాలి

రేపటి సూర్యోదయం కోసం జీవిస్తూ ఉండాలి 
సూర్యోదయం దర్శనంతో మరణాన్ని జయించిన మహాత్ముడివై జీవిస్తావు 

సూర్యోదయంతో ఎంతో ఆరోగ్యాన్ని పొందుతూ ఎన్నో కార్యాలను సాగించవచ్చు సమస్యలను పరిష్కారించవచ్చు 
సూర్యోదయంతో ఆరోగ్యాన్ని అభివృద్ధి చేసుకుంటూ శక్తి సామర్థ్యాలతో విజ్ఞాన భావాలతో అనేకమైన కార్యాలను అద్భుతంగా సాధించవచ్చు 


-- వివరణ ఇంకా ఉంది1 

మేధస్సులోని విజ్ఞానాన్ని సమాజానికి పరిశుద్ధంగా అందేలా ప్రకృతి అభివృద్ధి చెందేలా పరిశోధించు

మేధస్సులోని విజ్ఞానాన్ని సమాజానికి పరిశుద్ధంగా అందేలా ప్రకృతి అభివృద్ధి చెందేలా పరిశోధించు నిరంతరం పరిశుభ్రతను ప్రతి ప్రదేశంలో ప్రతి జీవికి అందించు  


-- వివరణ ఇంకా ఉంది!

ఓ సూర్యదేవా1 నీవు ఉదయించుటలో నాకు నీ దర్శన భాగ్యాన్ని ప్రతి రోజు కల్పించవా

ఓ సూర్యదేవా1 నీవు ఉదయించుటలో నాకు నీ దర్శన భాగ్యాన్ని ప్రతి రోజు కల్పించవా  
నా కార్యాలను ఉత్తేజవంతమైన ఆలోచనలతో ప్రకాశవంతమైన పరిశోధనలతో సాగించవా 

నా కార్యములు పరిశుద్ధంతో అపారమైన ప్రజ్ఞానంతో అమూల్యమైన సిద్ధాంతాలతో సాగేలా ప్రభవించవా 
నా కార్యములు అద్భుతమైన ప్రక్రియలుగా ప్రశాంతమైన ప్రమాణప్రద ప్రణాళికలతో సాగేలా సమీపించవా 

నా కార్య ప్రమేయములు యుగయుగాలుగా తరతరాలుగా సాగే విజ్ఞాన ప్రభూతమై నిలిచిపోవాలి నిరంతరం విశ్వ జగతిలో జీవులకు ప్రకృతి ప్రభావాలకు ఉపయోగం చెందుతూ సాగాలి 


-- వివరణ ఇంకా ఉంది!

Wednesday, October 29, 2025

మరణం ఎంతటి భావమో తెలిసిన వారికి ఎంతటి తత్వమో

మరణం ఎంతటి భావమో తెలిసిన వారికి ఎంతటి తత్వమో 
జీవించుటలో ఎంతటి ధైర్యమో ప్రయాణించుటలో ఎంతటి సామర్థ్యమో 

మరణం తపించుటలో మేధస్సుకు ఎంతటి తారసమో 
మరణం సహించుటలో మనస్సుకు ఎంతటి సమన్వితమో 

మరణంతో ఎన్ని బంధాలు దూరమవ్వునో ధ్యాసకు తెలియకపోవునే 
మరణంతో ఎన్ని కార్యాలు ఆగిపోవునో శ్వాసకు తెలుపకపోవునే 

మరణించుటచే ఎంతటి కార్య ఫలితం నిలిచిపోవునేమో 
మరణించుటచే ఎంతటి కార్య సిద్ధాంతం తెలియకపోవునేమో 

మరణం వరమై చేరగా శ్రమించుటలో ప్రశాంతత కలుగునేమో 
మరణం భారమై చేరగా ప్రయాణించుటలో (ప్రతిఘాతన) ప్రమాదం చేరిపోయేనేమో 
 
మరణం ఉందని తలచకు విజ్ఞానం ఉందని శ్రమించడం నిలుపకు 
మరణం లేదని తెలుపకు విజయం ఉందని సాధించడం విడువకు 

-- వివరణ ఇంకా ఉంది!

జీవితమంతా శ్రమిస్తున్నదంతా కేవలం ఐశ్వర్యం కోసమేనా

జీవితమంతా శ్రమిస్తున్నదంతా కేవలం ఐశ్వర్యం కోసమేనా  
ఐశ్వర్యాన్ని ఆర్జనము చేయడంలోనే విజ్ఞానం ఆరోగ్యం అనుభవం అభివృద్ధి ప్రశాంతతలు దాగి ఉన్నాయిగా  

ఐశ్వర్యంతోనే కార్యాలను సాగిస్తూ ఎన్నింటినో గమనిస్తూ ఎన్నో నేర్చుకుంటా ఎన్నో విధాలా జీవితాన్ని అభివృద్ధి చేసుకుంటూ తరతరాలుగా సాగిపోతున్నాము 

ఆహారం అందుబాటులో ఉంటే శ్రమించే సామర్థ్యం మేధస్సులో ఉత్తేజమై కార్యాలను సాగించే ఆలోచనలు అవలీలలుగా కలుగుతాయి విజ్ఞానాన్ని గ్రహిస్తూ అనుభవాలతో అభివృద్ధిని సాధిస్తాయి 

ఆహారానికి ఐశ్వర్యం ఎల్లప్పుడూ ప్రతి మనిషికి ఉండాలి అప్పుడే ప్రతి మానవుడు సంతోషంగా శక్తి సామర్థ్యాలతో శ్రమిస్తూ కుటుంబాన్ని అభివృద్ధి వైపు నడిపిస్తాడు 


-- వివరణ ఇంకా ఉంది!

ఇంతవరకు ఏ విజ్ఞానం చెందలేదా

ఇంతవరకు ఏ విజ్ఞానం చెందలేదా ఏదీ నేర్చుకోలేదా ఏ కార్యాన్ని గమనించలేదా  
ఆలోచనలతోనైనా జీవించలేదేమో భావ తత్వాల అవగాహన కూడా మేధస్సులో లేదేమో 

శరీరంతో జీవిస్తున్నట్లు మనస్సుకు కూడా తెలియదేమో కనిపిస్తున్నదంతా నేత్ర దృష్టిగా గోచరించలేదేమో 

జ్ఞానేంద్రియాలైనా కాలంతో జీవించుటలో మార్పు కలిగించలేదేమో జీవ ప్రక్రియలకు నవ నాడులు స్పందించలేదేమో 

ఏ ప్రదేశంలో ఏ అనుభవం ఏనాడు కలగలేదేమో ఏ మార్గంలో ఏ బంధం ఏ జీవం ఏ స్పర్శను ఏ విధంగా కలిగించలేదేమో 

తెలుసుకో ప్రతి కార్యాన్ని గమనించవా ప్రతి కదలికను అవగాహన చెందవా నీ రక్షణ జీవితం కోసం నీ వారి ప్రశాంతత కోసం 


-- వివరణ ఇంకా ఉంది!

సిరిసంపదల కోసం యుద్ధాలు చేస్తే ప్రశాంతత కోసం ఏం చేస్తారు

సిరిసంపదల కోసం యుద్ధాలు చేస్తే ప్రశాంతత కోసం ఏం చేస్తారు 

ఎవరు గొప్ప అని తెలిసేందుకు ఇద్దరు కలిస్తే తెలుస్తుంది అంతే గాని సైనికులతో సహా ప్రజల రాజ్యమంతా యుద్ధ రంగమై సాగితే ప్రజల రక్షణ ఎక్కడ రాజ్య నియమాలు ఎక్కడ రాజ్య సురక్షితం ఎక్కడ రాజ్య ప్రశాంతత ఎక్కడ రాజ్యం యొక్క గొప్పదనం ఎక్కడ రాజ్యంలో ఎవరు గొప్ప 

రాజ్యంలో ప్రజలకు ఆరోగ్యం వైద్యం విజ్ఞానం నీరు వసతి విద్యుత్తు రహదారులు మైదానం వృక్షాలు (స్వచ్ఛమైన ప్రకృతి ప్రాణ వాయువు) అవసరమైన సదుపాయాలు (ఆహార సామాగ్రి) నిరంతరం అందేలా సరైన సమయానికి అందుబాటులో ఉండాలి 

విజ్ఞానాన్ని అందించే గురువులు నిరంతరం యుగయుగాలుగా సాగుతూ ప్రజలకు సత్ప్రవర్తనను అందించాలి క్రమశిక్షణ ఇవ్వాలి ప్రతి సమస్యను ప్రశాంతంగా పరిష్కారించే భావ తత్వాలు అందరిలో కలగాలి ఎల్లప్పుడూ సాగుతూ ఉండాలి 

-- వివరణ ఇంకా ఉంది! 

మానవుడు ఆరోగ్యవంతుడిగా విజ్ఞానవంతుడిగా ఐశ్వర్యవంతుడిగా ఎదిగినా గుణవంతుడిగా జీవించాలి

మానవుడు ఆరోగ్యవంతుడిగా విజ్ఞానవంతుడిగా ఐశ్వర్యవంతుడిగా ఎదిగినా గుణవంతుడిగా జీవించాలి 

మానవుని జీవితం అనేక విధాలుగా సాగే వలయం 


-- వివరణ ఇంకా ఉంది! 

ఎంత కాలం జీవించినా అంత కాలం శ్రమిస్తూనే ఎదగాలి

ఎంత కాలం జీవించినా అంత కాలం శ్రమిస్తూనే ఎదగాలి విజ్ఞానాన్ని గ్రహిస్తూ అభివృద్ధి చేసుకోవాలి 

శ్రమిస్తూనే ఎదుగుతూ అన్ని విధాల ప్రతి సమయం విజ్ఞానం గ్రహిస్తూ ఆరోగ్యం వహిస్తూ కార్యాచరణ సాగిస్తూ  మహోదయమైన అనుభవంతో సర్వేంద్రియ అవగాహన కలిగి ఉండాలి సర్వాణువును ప్రకృతి పర తత్వంతో సమయోచితంగా ఉపయోగించుకోవాలి 


-- వివరణ ఇంకా ఉంది! 

అద్దెలతో మిద్దెలను నిర్మిస్తూ అంతస్తులు ఆకాశాన్ని చేరుతూ జీవితం అద్దెలతోనే సరిపోతున్నది

అద్దెలతో మిద్దెలను నిర్మిస్తూ అంతస్తులు ఆకాశాన్ని చేరుతూ జీవితం అద్దెలతోనే సరిపోతున్నది  

శ్రమించిన ఫలితమంతా అద్దెలతో సరిపోతే కుటుంబం అభివృద్ధి చెందేది ఎప్పుడో 

అద్దెలు మిద్దెల నిర్మాణానికి సరిపోయే విధంగా పెరుగుతూపోతే అద్దెలు ఆకాశాన్ని చేరుకుంటున్నాయి 

ఇల్లు లేని వారు ఉద్యోగ రిత్యా శ్రమించుటలో ఫలితం అద్దెలకు సరితూగుతున్నది జీవనం ఖర్చులతో ప్రయాణ దూరాలతో భారమవుతున్నది 


ధరలు పెరిగినా జీతాలు పెరగవే - జీతాలు పెరిగినా ధరలు ఆకాశాన్ని చేరునే 

ఉన్నవారికి ధరలు ఎలా ఉన్నా జీవనం సాగుతుంది 
లేనివారికి ధరలు ఎలా ఉన్నా జీవనం సంకోచిస్తుంది 

జీవన విధానమంతయు ధరలతోనే సాగుతున్నది 
ఆహారం వైద్యం విద్య వసతి ప్రయాణం అన్నీ అధిక ధరలతో వివిధ రూపాలతో అనేక విధాలుగా పరిణామాలు చెందుతూ పోతున్నాయి 

మనిషి జీవించుటలో కూడా ధర ఉన్నది - ధర లేని శ్వాస మానవునికి కరువాయే - స్వచ్ఛమైన శ్వాస జీవిత కాలమంతా అందకపోయేనే 


-- వివరణ ఇంకా ఉంది!

Tuesday, October 28, 2025

కాలం మానవునికి ఐశ్వర్యంతో సాగుతున్నది

కాలం మానవునికి ఐశ్వర్యంతో సాగుతున్నది 

ఐశ్వర్యం లేకుండా ఏ కార్యం జరగదు ఏ ఆహారం లభించదు 

ఐశ్వర్యం లేకుండా జీవించలేవురా ప్రయాణించలేవురా 
ఐశ్వర్యం లేకుండా సుఖించలేవురా సంతోషించలేవురా 

ఐశ్వర్యం లేకుండా శ్రమించగలిగితే ఐశ్వర్యం కలిగేనురా విజ్ఞానం తెలిసేనురా 

-- వివరణ ఇంకా ఉంది! 

విశ్వమే ఆరంభం జీవమే ప్రారంభం అణువులే ఆరంభం పరమాణువులే ప్రారంభం

విశ్వమే ఆరంభం జీవమే ప్రారంభం అణువులే ఆరంభం పరమాణువులే ప్రారంభం 

ప్రతీది ఉద్భవించుటచే (జన్మించుటచే) ఆరంభవుతుంది అలాగే వివిధ కార్యాలతో సాగుతుంది 

లక్ష్యాన్ని కార్యంతో ఆరంభిస్తే ఎప్పటికైనా ఫలితం అందుతుంది - కార్యాన్ని ఆలస్యం చేస్తే ఫలితం ఉండదు లేదా మరోలా ఉంటుంది 

విశ్వం తనకు తానుగా ఆరంభమవుతుంది కార్యమే మనకు మనమే ప్రారంభించాలి 
విశ్వ కార్యాలకు శాస్త్రీయం ఉన్నది తనకు తానుగా సాగుతుంది 
జీవ కార్యాలకు సిద్ధాంతం (ఆచరణ విజ్ఞానం ప్రణాళిక అనుభవం రక్షణ మార్గం) ఉన్నది మనకు మనమే ప్రారంభించాలి సాగించాలి 

-- వివరణ ఇంకా ఉంది! 

Monday, October 27, 2025

పరమేశ్వరా! అనంత స్వరూపాలను సర్వాంతర రూపంగా శరీరం పైననే ఎలా దాచుకున్నావు

పరమేశ్వరా! అనంత స్వరూపాలను సర్వాంతర రూపంగా విశ్వ విఖ్యాత స్వరూపమై స్వభూతంగా శరీరం పైననే ఎలా దాచుకున్నావు 

అఖండమైన పర్వతాలను గ్రహాలను మేఘ వర్ణాలను జలపాతాలను అంతరిక్ష సుందరములను పాతాళ భూ ప్రాంతాల దివ్యమైన ప్రదేశాలను గుహలను వనరులను ఖనిజములను జీవుల ఆకార రూపాలను వనరులను భయంకరమైన ప్రకృతి తాండవములను సర్వ సుందర సూర్య చంద్ర కాంతులను చీకటి వెలుగులను అనంతమైన భావ స్థితి తత్వములను నిండుగా నిలకడగా నిరాడంబరముగా నిరంతరంగా నిర్భయంగా నిశ్చలంగా నిశ్శబ్ధంగా నిర్మలమైన నారీ తత్వముచే నభ నటరాజునిగా ధ్యానముచే పర ధ్యాసతో సర్వ జీవుల శ్వాసతో సర్వాకార ఆకార రూపంగా దక్షిణ ముఖంగా నిలిచే వున్నావు ప్రభువా ...  నమో నమః శివాయ! ఓం నమః శివాయ!
 

ఓ పరమాత్మా! ప్రతి అణువు యోక్క నీ భావ తత్వములను సురక్షితంగా విశ్వ మేధస్సులో దాచి ఉంచాను

ఓ పరమాత్మా! ప్రతి అణువు యోక్క నీ భావ తత్వములను సురక్షితంగా విశ్వ మేధస్సులో దాచి ఉంచాను  

ఏ అణువు ఏ భావ తత్వములతో ఎలా జీవించునో వివిధ కాల సమయంతో సహా విశ్వ మేధస్సులో చేర్చుతున్నాను  

జీవుల భావ తత్వములు పరిశుద్ధమైతే నీకు పరిశోధన ప్రమేయ స్పందన కలిగించునని విశ్వ మేధస్సులో విడివిడిగా  కలుపుతున్నాను 

వివిధ ప్రళయములు ప్రకృతి తాండవ బీభత్సములు పంచభూతాల అవతారములతో సహా విశ్వ మేధస్సులో విజ్ఞాన అనుభవాలకై దాచేస్తున్నాను 

సంగీత వాద్యములు సర్వ స్వర గీతములు జీవములకు ప్రశాంతముగా ప్రకృతికి హాయిగా ఉండునని విశ్వ మేధస్సులో జత చేర్చాను 

ప్రకృతి శాస్త్రీయ సిద్ధాంతములు విజ్ఞాన సూత్రములు విభిన్న నైపుణ్యాలు నిర్మాణ ప్రణాళికలు సర్వం విశ్వ మేధస్సులో దృఢంగా భద్రపరిచాను 

సూర్యోదయ కిరణాల ఉత్తేజ ప్రకాశములు మేఘ వర్ణములు అంతరిక్ష కాంతులు గ్రహాల పరిభ్రమణాలు  అపురూపమైన అమూల్యమైన ప్రదేశములు ఖనిజములు వనరుల ఋతువుల పంచభూతాల ఆకార రూపాల భావ స్థితి తత్వములను సుదీర్ఘ కాలంగా యుగయుగాలకు జ్ఞానేంద్రీయ విచక్షణ జ్ఞాన గ్రంథంగా విశ్వ మేధస్సులో సర్వం సిద్ధ పరిచాను 

-- వివరణ ఇంకా ఉంది!

కాల సమయం ప్రకృతికి ఏనాడు వృధా కాదు

కాల సమయం ప్రకృతికి ఏనాడు వృధా కాదు 

జీవించే జీవులకే ఎంతో కాల సమయం వృధా అవుతుంటుంది 

జీవుల ఆలోచనలు (భావ తత్వాలు) ఏ కార్యానికై ఆలోచిస్తూ ఉంటాయో వేటిని అవగాహన చేస్తూ అర్థాన్ని గ్రహిస్తూ ఉంటాయో కాల సమయానికే తెలుసు 
విజ్ఞానంతో అజ్ఞానంతో తెలిసి తెలియక ఆలోచిస్తూ ఎన్నో జీవులు ఎన్నో సమయాలలో ఎన్నో విధాలుగా ఎంతో కాల సమయాన్ని వృధా చేస్తుంటాయి 

కాల సమయం వృధా ఐతే ప్రకృతికి ఎటువంటి నష్టం ఉండదు 
ప్రకృతి తనకు తానుగా ఎన్నో కార్యాలతో మిళితమై ఎన్నో విధాలా పంచభూతాల స్థితులతో జరిగిపోతుంటాయి 

సమయాన్ని ఉపయోగించుకోలేకపోతే మానవులకు విజ్ఞానం ఆరోగ్యం ఐశ్వర్యం అభివృద్ధి విజయం ఎలా ఎన్నో వృధా అవుతాయి 

ఇతర జీవులకు సమయం వృధా ఐతే ఆహారం కొరతగా ఏర్పడవచ్చు లేదా అందకుండాపోవచ్చు (అందుబాటులో ఉన్నది దక్కకుండా పోవచ్చు)

వీలైనంత వరకు విజ్ఞానంతో నైపుణ్యంతో జాగ్రత్తతో ఎరుకతో శ్రమిస్తూనే ఉండాలి ప్రతిఫలాన్ని పొందుతూనే ఉండాలి 


-- వివరణ ఇంకా ఉంది! 

ఒక ప్రశ్నకు సమాధానం ఒక పుస్తకమైతే ఒక జీవితానికి సమాధానం ఒక గ్రంథం అవుతుంది

ఒక ప్రశ్నకు సమాధానం ఒక పుస్తకమైతే ఒక జీవితానికి సమాధానం ఒక గ్రంథం అవుతుంది  
ఎన్ని పుస్తకాలు చదివినా సమాధానాలు విజ్ఞానమే గాని జీవితాల సారాంశం తెలుపదు 

ఒక గ్రంథం యొక్క సారాంశం విశ్వ విజ్ఞాన ప్రకృతి పరమార్థ జీవన విధాన శాస్త్రీయ కారణ సిద్ధాంత జీవితం (అణువుల బంధాల కార్యాచరణం - కార్యాలను నడిపించే మేధస్సుల ఆలోచనల భావ తత్వాల కాల సమయాల పంచభూతాల స్థితి పరిణామాల ప్రభావాల ఫలితార్ధం)


-- వివరణ ఇంకా ఉంది!

సమాజంలో జీవనం ఉండవచ్చు కాని జీవితం మాత్రం ప్రకృతిలోనే ఉంది

సమాజంలో జీవనం ఉండవచ్చు కాని జీవితం మాత్రం ప్రకృతిలోనే ఉంది 

సమాజంలో ఎన్ని నేర్చుకున్నా ఎన్ని కార్యాలు చేసుకున్నా అన్నీ ప్రకృతిలో దాగిన శాస్త్రీయ సిద్ధాంతాలే 

సమాజంలో ఎంత కాలం ఉన్నా ప్రకృతిలో జీవిస్తేనే పరమార్థం ప్రశాంతత దేహానికి పుష్కలంగా లభిస్తుంది 


-- వివరణ ఇంకా ఉంది! 

ఒక ప్రశ్నకు సమాధానం ఒక పుస్తకం కావచ్చు

ఒక ప్రశ్నకు సమాధానం ఒక పుస్తకం కావచ్చు కాని మనం చదవం చదవలేక పోవచ్చు  

ఒక ప్రశ్నకు సమాధానం మనం పుస్తకంలా వ్రాసుకోవచ్చు కాని దానిని కొన్ని సమయాలలో పూరించుకోలేము 

సమాధానం తెలిసినా చేయలేని కార్యాలు ప్రశ్నగా మిగిలిపోతాయి అలాగే ఇతరులు ప్రశ్నిస్తూనే ఉంటారు 

సమాధానం మనం ఇవ్వగలిగినప్పుడు కార్యం పూర్తవుతుంది ప్రశ్నకు ఉత్తరం పూరించబడుతుంది అప్పుడే  మనస్సు ప్రశాంతంగా ఉంటుంది కార్య ఫలితం లభిస్తుంది 

ప్రశ్న ఉన్నంతవరకు మనస్సు మేధస్సు అదోలా ఉంటుంది దేహం ఆరోగ్యం అదోరకంగా ఉంటుంది కొన్ని కార్యాలపై సరైన ఏకాగ్రత వహించదు ఆలోచన లను ప్రశ్న వేధిస్తూనే ఉంటుంది 

ప్రశ్నకు సమాధాన కార్యం జరగాలి ప్రతిఫలం లభించాలి అప్పుడే మేధస్సు ఉత్తేజమై జీవితం అభివృద్ధి చెందుతుంది ఇతరుల ఆదరణ లభిస్తుంది సరైన బంధం సాగుతుంది 

ఎన్ని ప్రశ్నలు వేసుకుంటే అన్ని ప్రశ్నలకు ఎన్నో సమాధానాలు ఎన్నో పుస్తకాలు వ్రాసుకోవాలి చదువుకోవాలి అలాగే కార్యాలను ఎన్నో ప్రయత్నాల సాధనతో సాధిస్తూ సమాధానాలతో ప్రతిఫలాన్ని దక్కించుకోవాలి 

ఒక ప్రశ్నకు సమాధానం పుస్తకంలో ఉండవచ్చు లేదా ఆలోచనలో ఉండవచ్చు లేదా ప్రయత్నించే కార్యంలో ఉండవచ్చు లేదా వివిధ మార్గాలలో ఉండవచ్చు 


-- వివరణ ఇంకా ఉంది!

Sunday, October 26, 2025

అన్నింటికన్నా వేగవంతమైనది మనస్సు ఐతే మనస్సు కన్నా వేగవంతమైనది ప్రమాదం

అన్నింటికన్నా వేగవంతమైనది మనస్సు ఐతే మనస్సు కన్నా వేగవంతమైనది ప్రమాదం 

గాలి కన్నా వేగవంతమైనది మనస్సు ఐతే మనస్సు కన్నా వేగవంతమైనది ప్రమాదం అజ్ఞానం మరుపు అజాగ్రత్త  వెలుగు (మెరుపు, జ్యోతి, అగ్ని ప్రమాదం) దూసుకు వెళ్ళే శక్తి అనుకోకుండా జరిగే విపత్తులు చాలా వేగవంతమైనవి 
 
విపత్తు (ఆపద) - మనిషి నుండి లేదా ప్రకృతి శక్తి నుండి ప్రమాదాలు చాలా వేగంగా ఆకస్మికంగా జరిగిపోతాయి 

వాహనాల ప్రయాణం వేగవంతమైనవి ప్రమాదమైనవి ఆలోచనకు మనస్సుకు మేధస్సుకు (భావ తత్వాలకు) తోచకుండానే తెలియకుండా జరిగిపోతాయి 


కావలసిన నెమ్మది కావలసిన జాగ్రత్త అవసరమైన జ్ఞాపక శక్తి ఎరుక మనలో అపారంగా అన్నివేళలా ఉండాలి ప్రయాణాలలో వ్యాపారాలలో ప్రయోగశాలలో నెమ్మది తనం (నిదానం) జాగ్రత్తగా ఉండాలి 
కొత్త ప్రదేశాలకు కొత్త మార్గాలకు వెళ్ళేటప్పుడు కొత్త ప్రయోగాలు చేసేటప్పుడు జాగ్రత్తగా నెమ్మదిగా ఉండాలి అలాగే తగట్టుగా ప్రయాణించాలి 

ఇతరుల నుండి ఇతర జీవుల నుండి ఇతర ప్రదేశాల నుండి ఇతర ప్రాంతాల నుండి ఇతర కార్యాల నుండి ఇతర ప్రకృతి పరిణామాల నుండి చాలా అవగాహనతో జాగ్రత్తగా ఉండాలి తగిన నియమాలు పాఠించాలి కార్యాలకు కావలసిన పనిముట్లను సిద్ధం చేసుకోవాలి ఎన్నో జ్ఞాపకం చేసుకోవాలి నైపుణ్యంతో ఉండాలి 

అనారోగ్యం కూడా చాలా వేగవంతమైనది అనుకోకుండా కలిగే పరిస్థితులే తెలుపుతాయి 
ఎంత ఆరోగ్యంగా ఉన్నా ఎటువంటి వ్యాధులు ఉన్నాయో తెలియని స్థితిలో అకస్మాతుగా గోచరిస్తాయి 


-- వివరణ ఇంకా ఉంది!

Saturday, October 25, 2025

శిక్షించే వారు క్షమించరు - క్షమించే వారు శిక్షించరు

శిక్షించే వారు క్షమించరు - క్షమించే వారు శిక్షించరు  

రక్షించే వారు హింసించరు - హింసించే వారు రక్షించరు 

శ్రమించే వారు విశ్రాంతి చెందరు (అధిక ప్రయత్నం) - విశ్రాంతి చెందే వారు శ్రమించరు (స్వల్ప ప్రయత్నం)

సహాయం చేసే వారు సలహా ఇవ్వక పోవచ్చు - సలహా ఇచ్చే వారు సహాయం చేయక పోవచ్చు 

సహాయం చేస్తూ సలహా ఇచ్చేవారు జాగ్రత్తను (శ్రమించే మార్గాన్ని ఫలితం కోసం) తెలియపరుస్తారు 
సలహా ఇస్తూ సహాయం చేసేవారు జాగ్రత్తను (శ్రమించే మార్గాన్ని ఫలితం కోసం) తెలియపరుస్తారు 

శ్రమించే మార్గం ఉపాయంగా ఉండాలి నైపుణ్యంతో ఉండాలి అనుభవంతో ఉండాలి ఉన్నతంగా ఉండాలి ప్రతిఫలంగా ఉండాలి ప్రశాంతంగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి పరిశుద్ధంగా ఉండాలి అభివృద్ధిగా ఉండాలి 


-- వివరణ ఇంకా ఉంది!

Friday, October 24, 2025

ఎన్నో భావాలను తెలిపెదను పరమాత్మా! నాతో ప్రయాణించెదవా

ఎన్నో భావాలను తెలిపెదను పరమాత్మా! నాతో ప్రయాణించెదవా 
ఎన్నో తత్వాలను కలిగించెదను పరమాత్మా! నాతో జీవించెదవా  


-- వివరణ ఇంకా ఉంది!

Thursday, October 23, 2025

Money is not a important but life is running with money

Money is not a important but life is running with money (only, always)

Money makes many things but need to know how to utilize and how much need to spend and when it will be required also need to know how to earn by reality of work with value of money.

Saving is more important than expenditure for future. Future is a relation, generation, family and so on.
Family need to grow in all areas like knowledge, occupation, healthy, happy, journey, celebrations, festivals, marriages, helping, etc.


-- Still need more explanation/discussion to understand! 

జీవితం త్రయ సిద్ధాంతమైనది కర్త కర్మ క్రియలతో సాగే సంసార సాగర ప్రయాస ప్రయాణమైనది

జీవితం త్రయ సిద్ధాంతమైనది కర్త కర్మ క్రియలతో సాగే సంసార సాగర ప్రయాస ప్రయాణమైనది  

విజ్ఞానం ఉన్నా వినయం ఉన్నా కర్మతో సాగే జీవితం ప్రమాదంతో కఠినంతోనే ఒడిదుడుకులతో సాగిపోతుంది 

-- వివరణ ఇంకా ఉంది!

భాష ప్రధానమైన మాట ప్రాముఖ్యమైనది

భాష ప్రధానమైన మాట ప్రాముఖ్యమైనది  

భాష విజ్ఞాన విధాతమైన సరికాని మాట ఒక పదమైన ఒక వాక్యమైన ప్రమాదమైనది జీవితాన్ని ఖండించునది బంధాలను విడదీయునది 


-- వివరణ ఇంకా ఉంది! 

అర్హత లేనివారికి అర్హత కల్పించుట అనర్హత అజ్ఞానాన్ని సాగించే జీవన విధాన జీవిత విఫలం

అర్హత లేనివారికి అర్హత కల్పించుట అనర్హత అజ్ఞానాన్ని సాగించే జీవన విధాన జీవిత విఫలం    
అర్హత లేనివారికి అర్హత కల్పించు వాడు అనర్హుడేగా (వారు అనర్హులే) 

అనర్హతగల వారు అర్హతతో చేసే కార్యాలు చాలా వరకు ఫలించవు అలాగే ఇతరులకు ఇబ్బందులు ఎదురవుతాయి 

మానవ విజ్ఞానం పూర్వం నుండి అభివృద్ధి చెందుతూ యుగ యుగాలుగా సాగుతున్న ఇంకా అజ్ఞాన జీవన విధానాన్ని సాగిస్తున్నారు 

అజ్ఞానాన్ని (అనర్హత) సాగించుటలో మావులకన్నా ఇతర జీవుల విధానమే ప్రధానం 

మానవ మేధస్సులో విజ్ఞాన పరిశోధనల అద్భుతాల అనంత శాస్త్రీయ సిద్ధాంతాలున్నా అజ్ఞాన అర్హతను కల్పించుట చాలా అన్యాయం ప్రమాదం సమస్యల వలయం 

-- వివరణ ఇంకా ఉంది!

Wednesday, October 22, 2025

ఏ సంస్థలో పనిచేసేవారైనా (ఉద్యోగస్తులు) వచ్చిన వారి పనులను ఎలాగైనా సంపూర్ణంగా ముగించేలా ప్రయత్నించాలి

ఏ సంస్థలో పనిచేసేవారైనా (ఉద్యోగస్తులు) వచ్చిన వారి పనులను ఎలాగైనా సంపూర్ణంగా ముగించేలా ప్రయత్నించాలి 

పని ఎలా చేయాలో తెలియనివారు లేదా తెలిసినవారు సోమరితనంతో మాటలతో మీ పనులు కావు అని తిరస్కరిస్తూ ఏవేవో మాటలు చెబుతూ ఎన్నో విధాలా అది లేదు ఇది లేదు అంటూ వెనుకకు పంపిస్తున్నారు 

అన్ని ఒకే చోట పనులు జరిగేలా సంస్థ సిబ్బంది ఉండాలి ఎవరి పని ఐనా ఇదు నిమిషాలలో జరిగేలా యంత్ర విజ్ఞాన విధానాలు నేడు గొప్పగా పనిచేస్తున్నాయి 

నియమాలు ఏవైనా ఎన్నైనా ఒక్క ఆధారమైన పత్రంతో ఎటువంటి పత్రములైన ఖాతాదారులకు లబ్ధిదారులకు ఐదు నిమిషాలలో ఇచ్చి పంపవచ్చు 

ఎన్ని రోజులుగా సంస్థ చుట్టూ తిరుగుతూ అనవసరమైన ఖర్చులతో ఖాతాదారులు లబ్ధిదారులు నిరాశతో వెనుకకు వెళ్ళిపోతారు  

ఉద్యోగస్తులకు కాస్త విజ్ఞానం ఓపిక శ్రద్ధ ఉంటే సంస్థలో అన్ని సదుపాయాలు (యంత్ర విజ్ఞానం, నియమాలు, పనితనం నైపుణ్యం అనుభవం) సరైన సిబ్బంది ఉంటే ప్రతి ఖాతాదారుడు లేదా ప్రతి లభ్డిదారుడు కావలసిన పత్రములతో తిరిగి ఐదు నిమిషాలలో వెళ్ళవచ్చు 

ప్రభుత్వం (ప్రభుత్వ సేవ) సహకరిస్తే యంత్రములతో యంత్ర విజ్ఞానంతో ఎన్నో కార్యాలు ప్రతి రోజు అవలీలగా చేయవచ్చు 


-- వివరణ ఇంకా ఉంది!


ఎవరి భావ తత్వములు ఎప్పుడు ఎలా పనిచేస్తాయో జీవ కార్యములకు ఎరుక

ఎవరి భావ తత్వములు ఎప్పుడు ఎలా పనిచేస్తాయో జీవ కార్యములకు ఎరుక 

భావ తత్వములు విజ్ఞానపరమై సర్వ  కార్యాలను సంపూర్ణ ఫలితాలతో సాగించాలి  

భావ తత్వములు ఉద్రేకమైతే ఆలోచనలు ఆవేశమైతే కార్యాలు సంపూర్ణంగా ఫలించక సమస్యలు పెరిగిపోతూ జీవితాలు వెనుకబడిపోతాయి 

సమాజంలో జరిగే కార్యాలకు అజ్ఞానం చెందక విజ్ఞాన ఎరుకతో మహా ప్రజ్ఞానంతో ముందుకు సాగాలి 


-- వివరణ ఇంకా ఉంది!

Tuesday, October 21, 2025

ఎవరైనా సరే సూర్యోదయాన మేల్కొని కార్యాలను సాగిస్తూ అద్భుతమైన విజయాలను సాధించుకుందాం

ఎవరైనా సరే సూర్యోదయాన మేల్కొని కార్యాలను సాగిస్తూ అద్భుతమైన విజయాలను సాధించుకుందాం 

మనకు అవసరమైన అనంత విజ్ఞానాన్ని విశ్వం నుండే అపారంగా గ్రహించి కొత్త అనుభవాలతో మహా ప్రజ్ఞానాన్ని సమాజానికి స్వచ్చంగా ఆరోగ్యంగా పరిశుద్ధమైన ప్రకృతితో నవ తేజాన్ని అందిస్తూ ప్రగతిని సాధించుకుందాం 


-- వివరణ ఇంకా ఉంది! 

Friday, October 17, 2025

నాలో ఉన్నది మీ విజ్ఞానమే మీలో ఉన్నది నా విజ్ఞానమే

నాలో ఉన్నది మీ విజ్ఞానమే మీలో ఉన్నది నా విజ్ఞానమే  
మనలో ఉన్నది పరిశోధించే మహా విజ్ఞాన పరిశుద్ధనమే  

పరిశుద్ధతకై సాగే పరిశోధనలో మనలో ఉన్నది శ్రమసారమే 


-- వివరణ ఇంకా ఉంది!

Thursday, October 16, 2025

మేధస్సులో కలిగే ఆలోచనలే ప్రపంచమంతా సాగే కార్యములు

మేధస్సులో కలిగే ఆలోచనలే ప్రపంచమంతా సాగే కార్యములు 
మానవుల కార్యములే సమాజంలో ఏర్పడే కీలకమైన సమస్యలు  


-- వివరణ ఇంకా ఉంది!

నీదే పరిస్థితి నాదే మతిస్థితి

నీదే పరిస్థితి (పరస్థితి) నాదే మతిస్థితి 
నీదే మహాస్థితి నాదే తెలియని భ్రమస్థితి   

ఏదో తెలియని స్థితిలో జీవస్థితి ఎలా ఉందో తెలుసుకోలేని అదోస్థితి 
ఏమి కలగని స్థితిలో దేహస్థితి ఎలా ఉందో తెలుపుకోలేని అరస్థితి 

మార్గం మధ్యలో నిలిచిపోతే మరస్థితి 
కార్యం మధ్యలో మిగిలిపోయే కర్మస్థితి 

శ్వాసకు తెలియని పురస్థితి ధ్యాసకే తోచని పూర్వస్థితి 
నాదమే తెలియని నరస్థితి వాద్యమే తోచని నాడిస్థితి 

ఊష్ణస్థితి తెలియని ఉచ్చ్వాస స్థితి 
ఊర్ధ్వస్థితి తెలియని నిచ్ఛ్వాస స్థితి 

గ్రహస్థితిని గ్రహించలేని విశ్వస్థితి 
వరస్థితిని వహించలేని సాధుస్థితి 

గుణస్థితిని గుర్తించలేని గురుస్థితి 
యదస్థితిని సహించలేని యమస్థితి  

దివ్య స్థితికై వేచినా పర స్థితి కలిగితేనే జ్యోతిస్థితి 
విద్య స్థితికై కొలిచినా పర స్థితి కలిగితేనే సుధస్థితి 

పరిస్థితి - పర స్థితి - సమస్యకు పరిష్కారం తెలియని పరిస్థితి - కార్యాన్ని సాగించలేని ప్రయత్నించలేని స్థితి (కార్యం చేయాలో తెలియని స్థితి)

ఉన్నతమైన కార్యానికి ఏ స్థితిలో ఉన్నా లక్ష్యాన్ని రక్షణతో జాగ్రత్తగా విజ్ఞానంగా సాగించాలి 
పరిస్థితులు సమస్యలకు కార్యాచరణ విధాన విజ్ఞానాన్ని పరీక్షించే పరిష్కార మార్గదర్శకములు 


-- వివరణ ఇంకా ఉంది!

ఆనాడు మానవుడు తనలో తానుగా జీవించేవాడు

ఆనాడు మానవుడు తనలో తానుగా జీవించేవాడు 
ఈనాడు మానవుడు తనలో తనకు తెలియకుండా జీవిస్తున్నాడు 

ఆనాటి వారు తమలో తాముగా ఆలోచించేవారు 
ఈనాటి వారు తమలో తమకు తెలియకుండా ఆలోచనలు లేకుండా జీవిస్తున్నారు 

దృష్టి ఒకవైపు ఆలోచన మరోవైపు శరీర స్థితి ఇంకోవైపుగా సాగుతూ జీవితం తెలియని విధంగా ప్రయాణిస్తున్నది 

ఆరోగ్యం ఎలా ఉందో శరీరానికే తెలియకుండా మేధస్సుకే విశ్రాంతి లేకుండా పోతున్నది 


-- వివరణ ఇంకా ఉంది! 

భావములు మేధస్సులో ఉద్భవిస్తే తత్వములు దేహస్సులో ఉత్పన్నమవుతాయి

భావములు మేధస్సులో ఉద్భవిస్తే తత్వములు దేహస్సులో ఉత్పన్నమవుతాయి  

భావములు వివిధ కార్యాలతో జ్ఞానేంద్రియముల ద్వారా కలిగినా తత్వములు శరీర స్థితి విధానాలతో దేహాన్ని ఆస్వాదించును 

 
-- వివరణ ఇంకా ఉంది!

మీ విజ్ఞానం సమాజానికి తెలియాలి

మీ విజ్ఞానం సమాజానికి తెలియాలి అప్పుడే మీ విజ్ఞానం ఎంతటిదో ఎలా ఉపయోగపడుతుందో తెలుస్తుంది  

మీ విజ్ఞానంతో వివిధ ఆచరణాల మార్గాలతో ప్రపంచాన్ని పరిశుద్ధమైన ప్రశాంతంగా స్వచ్ఛమైన ప్రకృతిగా మార్చవచ్చు 


-- వివరణ ఇంకా ఉంది!

ప్రతి అణువు ప్రతి రూపం అమూల్యమైన కాంతి తేజస్సుతో నిర్మితమై ఉంటుంది

ప్రతి అణువు ప్రతి రూపం అమూల్యమైన కాంతి తేజస్సుతో నిర్మితమై ఉంటుంది 

ఏ అణువును ఏ రూపాన్ని దర్శించినా కాంతి తేజత్వం రూప భావాల ఆలోచనత్వం మేధస్సులో కలుగుతుంది  

కనిపించని పంచభూతాల ప్రక్రియలు కూడా శరీర స్థితి ధర్మం వివిధ సమయాలలో వివిధ ప్రభావాలతో స్వీకరిస్తుంది 

నలుపు వర్ణం కూడా మహా కాంతి స్వరూపమే చీకటిలో కనిపించకపోయినా వెలుగులో తన వర్ణాన్ని 
ప్రతిబింభింపజేస్తుంది తన తత్వాన్ని కలిగివుంటుంది 

-- వివరణ ఇంకా ఉంది!

ప్రతి రోజు పరిశుద్ధత విజ్ఞానం ఐశ్వర్యం కోసం శ్రమిస్తూ అభివృద్ధిని సాధించాలి

ప్రతి రోజు పరిశుద్ధత విజ్ఞానం ఐశ్వర్యం కోసం శ్రమిస్తూ అభివృద్ధిని సాధించాలి  

పరిశుద్ధమైన కార్యాల విజ్ఞానంతో నైపుణ్యమైన విధానాలతో శ్రమిస్తూ ఫలితాన్ని అందుకోవాలి 

మానవునికి పరిశుద్ధత విజ్ఞానం ఐశ్వర్యం ప్రధానమైనవి ఆచరణతో సాగే జీవన కార్యాల ప్రభావితములు 


-- వివరణ ఇంకా ఉంది!

Wednesday, October 15, 2025

ఉన్నది ఖాళీ అయ్యేంతవరకు లేనిది తెచ్చుకోవద్దు

ఉన్నది ఖాళీ అయ్యేంతవరకు లేనిది తెచ్చుకోవద్దు 
లేనిది తెచ్చుకుంటే ఉన్నది అలాగే ఎక్కవ కాలం ఉండిపోయి నిరుపయోగమవుతుంది వృధా అవుతుంది 

లేనిది తెచ్చుకున్నా ముందుగా ఉన్నదానిని ఖాళీ చేయాలి ఉపయోగించుకోవాలి 
ఉన్న దానినే మరల తెచ్చుకుంటే ముందుగా ఉన్న దానిని మొదటిగా ఉపయోగించుకోవాలి ఖాళీ చేయాలి 

ఉన్నవి వాడకుండా లేనివి తెచ్చుకొని వాడకుండా ఉంటే అన్నీ వృధా అవుతాయి ఖర్చులు పెరిగిపోతాయి 

లేనిది తెచ్చుకోవాలంటే చాలా ముఖ్యమైన అవసరం ఉండాలి అలాగే వెంటనే వాడుకోవాలి ఖాళీ చేయాలి 

ప్రతి రోజు ప్రపంచంలో ఎన్ని ఎలా వృధా అవుతాయో పండించిన రైతుకు లేదా చిగురించిన ప్రకృతికే తెలియాలి 

అవసరానికి తెచ్చుకోవాలి అనవసరానికి విడుచుకోవాలి వదులుకోవాలి 

ఆరోగ్యానికి వాడుకోవాలి అనారోగ్యానికి విడిచిపెట్టాలి వదులుకోవాలి 

తాజాదనంలో ఉన్న ఆరోగ్యం పాతదనంలో ఉండదు
(ఎక్కువ సమయం నిలువ చేసిన వాటిలో తాజాదనం ఉండదు)

కొన్ని పాతదనంలో ఉన్న ఆరోగ్యం కొత్తదనంలో ఉండవు 


-- వివరణ ఇంకా ఉంది!


విశ్వ ప్రకృతిలో శాస్త్రీయ సిద్ధాంతము ఉంటుంది

విశ్వ ప్రకృతిలో శాస్త్రీయ సిద్ధాంతము ఉంటుంది అలాగే అభివృద్ధి చెందుతూ తరుగుతూ ఉంటుంది 
జీవుల మేధస్సులలో అజ్ఞాన విజ్ఞాన స్వభావ తత్వాల ఆలోచనలు కలుగుతూ సాగుతూ ఉంటాయి 

జీవులు (మానవులు, ఇతర జీవులు) అజ్ఞానాన్ని తెలుసుకొని అనర్థాన్ని విజ్ఞాన పరమార్థంగా మార్చుకోవాలి 

అజ్ఞానం (అజాగ్రత్తలు, మరుపు, తెలియకపోవడం, ఆలోచించకపోవడం, అనుభవం లేక పోవడం, భవిష్య ప్రభావాలను గుర్తించకపోవడం, కార్యాల ఫలితాలు అంచనా వేయలేకపోవడం, ఋతువుల కాల ప్రభావాలు తెలియకపోవడం, ఇలా ఎన్నో జరిగే వాటిని జరిగిన వాటిని తెలుసుకోలేకపోవడం తెలియకపోవడం  తెలుసుకునేందుకు అవకాశం లేకపోవడం, మేధస్సు సరైన విధంగా గ్రహించకపోవడం, అనుభవమైన వయస్సు లేకపోవడం, గుర్తించలేకపోవడం, కొత్త వాటిని పరిచయం చేసుకోలేకపోవడం, అర్థం చేసుకోలేకపోవడం)


-- వివరణ ఇంకా ఉంది!

Tuesday, October 14, 2025

పరమాత్మకు తల్లి తండ్రులు ఉన్నారని అనుకుంటే పరమార్ధాత్మ పరిశుద్ధాత్మ గా చెప్పుకోవచ్చు

పరమాత్మకు తల్లి తండ్రులు ఉన్నారని అనుకుంటే పరమార్ధాత్మ పరిశుద్ధాత్మ గా చెప్పుకోవచ్చు 
పరమాత్మ భావ తత్వాలు పరమార్థంగా పరిశుద్ధంగా సాగుతూ విశ్వమంతా ఉత్తేజంతో ఉద్భవిస్తూనే ఉంటాయి 

సూర్యోదయంలో ఎన్నో పరమాత్మ భావ తత్వాలు పరిశుద్ధమై ప్రతి అణువులో ఉత్తేజత్వాన్ని కలిగిస్తాయి 
సూర్యోదయంతో విశ్వమంతా పరిశుద్దమై ఎన్నో భావ తత్వాలతో అణువులన్నీ వివిధ కార్యాలకు సిద్ధమవుతాయి 

సూర్యోదయంతో విశ్వ ప్రకృతి పరిశుద్ధమైతే జీవులన్నీ ఉత్తేజమై ఆరోగ్యంతో వివిధ కార్యాలతో జీవన విధానాన్ని అభివృద్ధి చేసుకుంటాయి 
 
పరిశుద్ధత నుండి పరిపూర్ణమైన పరమార్థ భావ తత్వాలు ఉదయిస్తాయి (ఉద్భవిస్తాయి) అలాగే అణువులు  పరమాణువులు ఆత్మగా పరమాత్మగా ప్రకృతిలో వివిధ రూపాలతో వివిధ పరిమాణాలతో నిలయమవుతాయి 

పరిశుద్ధత నుండి పరమార్థం తెలుస్తుంది - సామర్థ్యం నుండే కార్యార్థం జరుగుతుంది 
పరిశుద్ధత శక్తి వంతమైనది సామర్థ్యమైనది సృష్టికి మూలమైనది 

-- వివరణ ఇంకా ఉంది!

నీ శరీర విధానమే నీ జీవన కార్యాల అభివృద్ధి నీ శ్రమ ఫలితాల జీవితం

నీ శరీర విధానమే నీ జీవన కార్యాల అభివృద్ధి నీ శ్రమ ఫలితాల జీవితం 

నీ కార్యములు ఎలా సాగుతాయో నీ శరీరం అలా నీ ఆలోచనలకు సహకారంగా ఉంటుంది 

నీ కార్యములే నీ అభివృద్ధి నీ శరీరమే నీ శ్రమత్వం నీ ఆలోచనలే నీ జీవన విధానం 

నీ అభివృద్ధిని నీవే సాధించాలి నీ శ్రమను నీ శరీరమే భరించాలి (సహించాలి సహకరించాలి) నీ ఆలోచనలే నీ కార్యాలను సాగించాలి  


-- వివరణ ఇంకా ఉంది! 

Monday, October 13, 2025

విజ్ఞానాన్ని నేర్చుకుంటూ పోతే ఎటువంటి జ్ఞానమైన మేధస్సు గ్రహిస్తుంది

విజ్ఞానాన్ని నేర్చుకుంటూ పోతే ఎటువంటి జ్ఞానమైన మేధస్సు గ్రహిస్తుంది  

విజ్ఞానాన్ని కార్యాలతో ప్రకృతితో విశ్వ భావ తత్వాల శాస్త్రీయ సిద్ధాంతాలతో పరిశోధిస్తూ సాగిపోతే అంతరిక్ష విజ్ఞానమైన బ్రంహాండమైన బ్రంహ జ్ఞానమైన మేధస్సులో చేరుతుంది (పరమార్థమవుతుంది) పరమార్థం తెలుస్తుంది 

ఏకాగ్రతతో కూడిన ప్రశాంతమైన సాధన విశ్వ ప్రకృతిని గ్రహించే శాస్త్రీయ సిద్ధాంతమైన ఆలోచనల కాల కార్యాల ప్రభావిత పరిణామాల అనుభవం మేధస్సులో నిక్షిప్తం చేసుకుంటూ అనంత అంతరిక్ష బ్రంహాండంపై గమనం సాగిస్తూ అపారమైన దివ్య దృష్టిని మేధస్సు సహితం (ధ్యాన ప్రమేయ సమయం) చేసుకోవాలి అప్పుడే సర్వ విజ్ఞానం శిరస్సులో పరమార్థమవుతుంది 

విజ్ఞానాన్ని వ్రాసుకుంటూ పోతే కొత్త భావాలతో సరి కొత్త విజ్ఞానాన్ని తెలుసుకుంటూ పోవచ్చు 
విజ్ఞానాన్ని సంభాషిస్తూ సంబోధిస్తూ పోతే ఎన్నో కొత్త కొత్త విషయాలతో సరి కొత్త విజ్ఞానాన్ని తెలుసుకుంటూ పోవచ్చు 

-- వివరణ ఇంకా ఉంది!

శక్తిని గుర్తించాలంటే ఫలితాన్ని పొదుపు చేసుకోవాలి

శక్తిని గుర్తించాలంటే ఫలితాన్ని పొదుపు చేసుకోవాలి  

పొదుపు చేసుకున్న ఫలితాన్ని అభివృద్ధి చేసుకుంటే మరో మహా ఫలితం కుటుంబానికి లభిస్తుంది అన్ని రకాల సంతోషాలను ఇస్తుంది 

 -- వివరణ ఇంకా ఉంది!

నేటి కాలమున శ్రమ కన్నా ఖర్చులు ఎక్కువగా సాగుతున్నాయి

నేటి కాలమున శ్రమ కన్నా ఖర్చులు ఎక్కువగా సాగుతున్నాయి 

శ్రమకు ఫలితం ఎక్కువగా ఉందంటే త్వరగా అభివృద్ధి సాధించాలని తెలుసుకోవాలి 

శ్రమకు ఫలితం ఎక్కువ ఉందని ఖర్చులు ఎక్కువగా పెంచుకుంటూ పోతే ఫలితం శూన్యం అవుతుంది శ్రమ వృధా అవుతుంది 

పొదుపు లేని ఫలితం శూన్యంతో సమానం 
ఆదాయం లేని శ్రమ అనారోగ్యంతో సమానం 
ఖర్చులను తగ్గించుకునే మార్గం అభివృద్ధిని చేరుకునే గమ్యం 
ఖర్చులతో ఆదాయం ఖాళి ఐతే పొదుపులతో ఆదాయాన్ని పెంచుకోవాలి 

-- వివరణ ఇంకా ఉన్నది! 

Sunday, October 12, 2025

జీవముల నుండి కార్యములు మొదలవుతాయి

జీవముల నుండి కార్యములు మొదలవుతాయి 

కార్యములు జీవములను ఎలా నడిపిస్తాయో మరో జీవులకు కూడా తెలిసి తెలియకుండా పోవచ్చు 
జీవ కార్యములు విశ్వ ప్రకృతిచే సమాజంచే అజ్ఞాన విజ్ఞానములచే సాగిపోతాయి 


-- వివరణ ఇంకా ఉంది! 

మానవుడు యంత్రములచే జీవిస్తున్నాడు యంత్రములు మానవునిచే జీవిస్తున్నాయి

మానవుడు యంత్రములచే జీవిస్తున్నాడు యంత్రములు మానవునిచే జీవిస్తున్నాయి 

మానవుని తంత్ర విజ్ఞానమంతా యంత్రాలుగా మారుతూ మానవుడు యంత్రములచే జీవిస్తున్నాడు 

దృష్టిచే మానవుని విజ్ఞానం వేగంగా అభివృద్ధి చెందినా తంత్ర యంత్ర దృష్టి రూప చిత్ర నిర్మాణంచే జీవన కార్యములు దృష్టి దృశ్య యంత్రములచే సాగుతున్నాయి  


మానవుడు తన విజ్ఞానంతో ప్రకృతిచే యంత్రములను సృష్టించుకుని ఎన్నో పరికరాలను తయారు చేసుకుంటూ ఉపయోగించుకుంటున్నాడు 


== వివరణ ఇంకా ఉంది!

మహాత్మునికి గురువు మహర్షి ఐతే మహాత్ముడు ఏ సమస్యలో ఉన్నా లోక రక్షణకై మహర్షి యొక్క విజ్ఞాన పరిస్కారాన్ని ఆచరిస్తాడు

మహాత్మునికి గురువు మహర్షి ఐతే మహాత్ముడు ఏ సమస్యలో ఉన్నా లోక రక్షణకై మహర్షి యొక్క విజ్ఞాన పరిస్కారాన్ని ఆచరిస్తాడు 

మహర్షులు కాలజ్ఞానంతో ధ్యానించే అమరేంద్రులు - లోక రక్షణకై మహాత్ములను నడిపించే అపార విజ్ఞాన పండితులు 

మహర్షుల శిష్యులు ఋషులుగా అవతరిస్తూ కాలంతో పాటు మహర్షులుగా మారుతూ లోకాన్ని రక్షిస్తూ ఉంటారు (విజ్ఞానంతో నడిపిస్తూ ఉంటారు)

మహర్షులు పంచభూతాల విశ్వ జ్ఞానాన్ని పరిశోధిస్తూ భవిష్యత్ ను ధ్యానిస్తూ జీవితాన్ని సాగిస్తుంటారు 


-- వివరణ ఇంకా ఉంది! 

సూర్యోదయమే అనంత కార్యాలకు పరిష్కారం అందిస్తుంది

సూర్యోదయమే అనంత కార్యాలకు (సమస్యలకు) పరిష్కారం అందిస్తుంది  

సమస్యలు వివిధ కార్యాలను కలిగించి (సృష్టించి) మేధస్సులలో ఆలోచనల నైపుణ్యాన్ని పెంచేలా చేస్తూ పరిష్కారాన్ని పరిశోధించేలా చేస్తాయి సమయాన్ని సమయోచిత సందర్బంగా ప్రయోజనంగా విజ్ఞానంగా మారుస్తాయి 

సూర్యోదయాన సమస్యల కార్యాన్ని (కార్యాలను) ఆరంభిస్తే పరిష్కారాలతో వివిధ కార్యాలుగా సాగిపోతూ తీరిపోతాయి అలాగే ఫలిస్తాయి  


-- వివరణ ఇంకా ఉంది!

పాత మూట బంగారు బాట కొత్త మూట ఖర్చుల మోత

పాత మూట బంగారు బాట కొత్త మూట ఖర్చుల మోత 

పాత జ్ఞానం భవిష్య విజ్ఞానం కొత్త జ్ఞానం భవిష్య శ్రమయం 

ఆనాటి జ్ఞానానికి ఫలితం ఎక్కువ ఈనాటి జ్ఞానానికి ఖర్చు ఎక్కువ 

ఆధునిక జ్ఞానం ఉన్నా ఫలితం ఖర్చుతో శ్రమతో ఎక్కువ సమయంతో జరిగేలా నియమాలు నిబంధనలు నిర్ణయిస్తున్నారు 

పది నిమిషాల కార్యాన్ని పది రోజులుగా సాగదీస్తారు - యంత్రం సులువుగా చేసి కార్యాన్ని రెండు నిమిషాలలో ముగించగలిగినా మానవ మేధస్సు దానిని వివిధ నియమాలతో ఒక వారంగా వివిధ ఖర్చులతో పెంచుతున్నారు 

ఉచిత సేవలను కూడా ఖర్చుల శ్రమగా రోజులుగా అనారోగ్యంగా కాస్త అజ్ఞానంగా విసిగించేలా వ్యాపారంగా మారుస్తున్నారు 


-- వివరణ ఇంకా ఉంది! 

Saturday, October 11, 2025

భావ తత్వాలు లేకుండా ఏ కార్యం సాగదు అణువు స్పందించదు

భావ తత్వాలు లేకుండా ఏ కార్యం సాగదు అణువు స్పందించదు      

విశ్వంలో ప్రతీది అనంతమైన భావ తత్వాలతో నిర్మితమైనది సూక్ష్మ అణువుల రూపాలతో జీవ కణాలతో ఉద్బవించినది  


-- వివరణ ఇంకా ఉంది!

రూపాన్ని సుందరంగా మార్చుకోవడం కన్నా మేధస్సును విజ్ఞానంగా మార్చుకోవడమే ప్రదానం

రూపాన్ని  సుందరంగా మార్చుకోవడం కన్నా మేధస్సును విజ్ఞానంగా మార్చుకోవడమే ప్రదానం 

రూపాన్ని సౌందర్యంగా కళా శిల్పిగా మార్చుకోవడానికి ఖర్చు చేసుకోవడం కన్నా మేధస్సును విజ్ఞానంగా జీవన శైలితో  ఐశ్వర్యవంతంగా మార్చుకోవడమే ప్రథమం 

శ్రమ (కార్య ప్రయత్నం) కాలం (సమయం) శక్తి (సామర్థ్యం) ఐశ్వర్యం (ఆధారం, ఫలితం) ఆరోగ్యం (సమయాలోచన స్థితితో సాగించడం) చాలా అవసరమైనవి భవిష్యాన్ని సాగించే పంచామృతం లాంటివి శరీరం జీవించుటకు పంచభూతములు లాంటివి 


-- వివరణ ఇంకా ఉంది!

శ్రమను ఖర్చు చేసుకోవద్దు శ్రమను అభివృద్ధి చేసుకోవాలి

శ్రమను ఖర్చు చేసుకోవద్దు శ్రమను అభివృద్ధి చేసుకోవాలి  

శ్రమ ఫలితంగా సాగాలి శ్రమ ఐశ్వర్యవంతంగా అభివృద్ధితో సాగిపోవాలి 

శ్రమను ఖర్చులతో ఖాళీగా చేసుకోరాదు శ్రమను విజ్ఞానంతో ఐశ్వర్యవంతంగా చేసుకోవాలి 

ఖర్చులతో తాత్కాళిక ఆనందనాన్ని పొందడం కన్నా ఐశ్వర్యంతో శ్వాశ్వత అభివృద్ధిని జీవితంలో సంతోషంగా అనుభవించాలి 

-- వివరణ ఇంకా ఉంది!

Friday, October 10, 2025

మానవుని శరీరం రూపం మాత్రమే కాదు ఒక మహా ఆయుధం ఓ మహా దైవ యంత్రం

మానవుని శరీరం రూపం మాత్రమే కాదు ఒక మహా ఆయుధం ఓ మహా దైవ యంత్రం  

భవిష్యత్ ను కాల జ్ఞానంతో పాటు యంత్ర జ్ఞానంగా మానవ మేధస్సు వివిధ ఆయుధ శక్తులతో పనిచేస్తుంది 

ప్రకృతి రూపం కూడా యంత్ర రూప నిర్మాణంతో వివిధ జీవన శైలితో ఎన్నో రకాలుగా మారుతుంది 

వేగం ప్రమాదం కావచ్చు ప్రశాంతత బీభత్సం చేయవచ్చు ఆరోగ్యం అనావ్యవస్థతగా మారిపోవచ్చు విజ్ఞానం అపారంగా కనిపించవచ్చు  ఐశ్వర్యం అపాయంతో చేరవచ్చు 

ఉన్నతమైన మార్గం స్వచ్ఛమైన పరిశుద్ధమైన పర్యావరణమైన ప్రశాంతమైన ప్రకృతి జీవితం  


-- వివరణ ఇంకా ఉంది1

కార్యం భావనతో సాగినా దేహం తత్వనతో సహనాన్ని కలిగిఉంటుంది

కార్యం భావనతో సాగినా దేహం తత్వనతో సహనాన్ని కలిగిఉంటుంది 


-- వివరణ ఇంకా ఉంది1 

మేధస్సులో ఎంతటి అద్భుతమైన విజ్ఞానం ఉన్నా ప్రగతికై ప్రయత్నించే ఆలోచన ఒక్కటి విశ్వాన్ని అభివృద్ధి వైపు నడిపిస్తుంది

మేధస్సులో ఎంతటి అద్భుతమైన విజ్ఞానం ఉన్నా ప్రగతికై ప్రయత్నించే ఆలోచన ఒక్కటి విశ్వాన్ని అభివృద్ధి వైపు నడిపిస్తుంది  

ఎటువంటి మానవుడైనా తన బంధాలను అపూర్వమైన విశ్వ శాస్త్రీయ విజ్ఞాన సిద్ధాంత ప్రగతితో సాగిస్తూ ప్రకృతిని అభివృద్ధి వైపు సుదీర్ఘంగా నడిపించాలి 

ఆలోచనలో ఉన్న శక్తి ఆచరణలో శ్రమ యోధంగా సహస్త్ర సమయ శక్తితో సిద్ధాంత పూర్వకంగా అఖండమైన కార్యాన్ని సాగించాలి 


-- వివరణ ఇంకా ఉంది!

Wednesday, October 8, 2025

ప్రశ్నకు అర్థం ప్రశ్నించుటలో ఉండాలి

ప్రశ్నకు అర్థం ప్రశ్నించుటలో ఉండాలి 

ఉత్తరానికి (సమాధానానికి) పరమార్థం విశ్లేషించుటలో ఉండాలి 

ప్రశ్న అర్థమైతేనే ఉత్తరం వెలువడుతుంది 


-- వివరణ ఇంకా ఉంది!
 

భక్తితో ఉన్నత మార్గం తెలుస్తుందే గాని కార్య శ్రమం సాగదు

భక్తితో ఉన్నత మార్గం తెలుస్తుందే గాని కార్య శ్రమం (ప్రయత్నం) సాగదు 

భక్తితో కార్యాన్ని ఎలా ఉన్నతంగా చేయాలో తెలుసుకోవచ్చు - శ్రమిస్తే గాని కార్యం సాగదు ఫలితం కలగదు 

భక్తితో సాగే కార్యాల వెనుక కూడా అపారమైన వివిధ పూర్వ కార్యాల విజ్ఞాన శ్రమ ఫలితం దాగి ఉన్నది 

ఆలయాలలో సాగే భక్తి కార్యాలు ఆనాటి నుండి సాగే శ్రమ విధాన సిద్ధాంత పరిణామాలు ఆచరణ నియమాలు అశేషమైన మంత్రం శాస్త్రములు ఉన్నతమైన మార్గాన్ని తెలిపే జీవన చరితములు 


-- వివరణ ఇంకా ఉంది!

శ్రమలో శ్రద్ధ కార్యంలో శిక్షణ సమయంతో సహనం సాధనలో విజ్ఞానం ఎల్లప్పుడూ ఉండాలి

శ్రమలో శ్రద్ధ కార్యంలో శిక్షణ (క్రమశిక్షణ) సమయంతో సహనం సాధనలో విజ్ఞానం ఎల్లప్పుడూ ఉండాలి 

ప్రతి కార్యానికి శ్రమ శ్రద్ధ క్రమకార్య విధాన సమయాలోచనతో సాగే సహనం సాధించుటలో విజ్ఞానం అవసరం 

ఎందరో శ్రమించినా అభివృద్ధి చెందేవారు కొందరే 
శ్రమించుటలో ఎన్నో విధాలా అనుభవ విజ్ఞాన నైపుణ్యమైన సాధన సాగాలి 

శ్రమించుటలో విజయం ఉన్నది విఫలం ఉన్నది విశ్రాంతి (విఫలం) ఉన్నది ప్రశాంతత (విజయం) ఉన్నది 

శ్రవించుటచే విజ్ఞానం పొందాలి ఆ తర్వాత విజ్ఞానంతో శ్రమించాలి అప్పుడే నైపుణ్యంతో విజయాన్ని సమయ సాధనతో (సహన శక్తితో కార్య సిద్ధితో) పొందగలుగుతాము 


-- వివరణ ఇంకా ఉంది! 

జీవించడమే అనుభవించడం అనుభవించడమే జీవించడం

జీవించడమే అనుభవించడం అనుభవించడమే జీవించడం 

ఎప్పుడు ఎలా ఏ కార్యంతో సాగిపోతామో సమయానికే తెలిసిన అనుభవ భావ తత్త్వం  

మనం కోరిన కార్యాలు మనకు ఉపయోగమైనవిగా ఇష్ట పూర్వకంగా అనుభవించేలా ఉన్నట్లు భావించుకుంటాం 

కార్యాలను అభివృద్ధి సమృద్ధిగా మార్చుకుంటూ విజ్ఞాన ప్రజ్ఞానంతో సాగించుకోవాలి  సాధనతో సాధించుకోవాలి 


-- వివరణ ఇంకా ఉంది!

ఆలోచనలో భావన లేదా అవగాహనలో తత్వన లేదా కార్యాలతో సాగిపోవుటలో ఉత్తేజం లేదా

ఆలోచనలో భావన లేదా అవగాహనలో తత్వన లేదా కార్యాలతో సాగిపోవుటలో ఉత్తేజం లేదా 

మేధస్సులో ఉపయోగకరమైన విజ్ఞానవంతమైన ఆలోచనలు కలుగుటలో ఏకాగ్రత అపారమైన భావ తత్వాలను ఉత్తేజవంగా (ఆస్వాదిస్తూ కార్యాచరణాన్ని) వివిధ కార్యాలతో గ్రహిస్తుంది  

మేధస్సు ఎప్పుడూ అవగాహనతో ఆలోచిస్తూ భావ తత్వాలను ఉత్తేజం చేసుకుంటూ కార్యాలను విజ్ఞానవంతంగా సాగించాలి 


-- వివరణ ఇంకా ఉంది!

ఉన్నవారికి ఇవ్వడం తెలియాలి లేనివారికి తిరిగి ఇవ్వడం తెలియాలి

ఉన్నవారికి ఇవ్వడం తెలియాలి లేనివారికి తిరిగి ఇవ్వడం తెలియాలి 
ఏది లేనివారికి ఎవరూ లేనివారికి అవగాహనతో ఎదుగుతూ విజ్ఞానం చెందడం తెలియాలి  

అందరికి అవగాహనతో ఎదుగుతూ విజ్ఞానం చెందడం తెలియాలి నిరంతరం అభివృద్ధి చెందుతూ సాగాలి 

విజ్ఞానంతో పాటు సత్ప్రవర్తన పరిశుద్ధత క్రమశిక్షణ క్రమ కార్యాచరణ ఆరోగ్యం నిర్మాణం వస్తువుల ఉపయోగం వాటి సురక్షిత ప్రదేశం ప్రకృతి అభివృద్ధి తెలియాలి - ఇలా ఎన్నో గుర్తించుకోవాలి నేర్చుకోవాలి తెలుసుకోవాలి ఆచరించాలి 

ఎల్లప్పుడూ శ్రమిస్తూ అన్నింటిని గ్రహిస్తూ ప్రశాంతంగా శాస్త్రీయంగా సురక్షితంగా జీవించాలి  


-- వివరణ ఇంకా ఉంది!

విశ్వమే ఆరంభం శూన్యమే ప్రారంభం జగమే ఉద్భవించడం

విశ్వమే ఆరంభం శూన్యమే ప్రారంభం జగమే ఉద్భవించడం 
ప్రదేశమే అంతరిక్షం ప్రముఖమే బ్రంహాండం పరిణామమే ప్రకృతం 

శూన్యం అనంతం అంతర్ముఖం అద్భుత ప్రదేశ విశాల ఆకాశ పంచభూత బ్రంహాండ ప్రభూత అంతరిక్షం అమరిక అమరగృహం 


-- వివరణ ఇంకా ఉంది!

Monday, October 6, 2025

ఆనాడు మీరు ఎదగడానికి శ్రమించారు ఈనాడు మీ తోటివారు ఎదగడానికి కృషిస్తున్నారు

ఆనాడు మీరు ఎదగడానికి శ్రమించారు ఈనాడు మీ తోటివారు ఎదగడానికి కృషిస్తున్నారు 
అలాగే సంస్థలో కూడా మీరు ఎదగడానికి శ్రమించాలి మీ తోటివారు ఎదగడానికి కృషించాలి 

మీరు ఎదిగినప్పుడు మీ కుటుంబం ఎదగడానికి అభివృద్ధి చెందడానికి ఎలా శ్రమిస్తారో అలాగే సంస్థలలో సంఘంలో సమాజంలో అన్ని రంగాలలో అన్ని ప్రాంతాలలో అన్ని విధాల ఎదుగుతూ అందరికై శ్రమిస్తూ ఆరోగ్యంతో కృషించాలి 

ఒకరి ఎదుగుదల మీ ఆత్మ స్థైర్యాన్ని పెంచాలి మీ శ్రమను అభివృద్ధి చేసుకోవాలి 


-- వివరణ ఇంకా ఉంది!  

Saturday, October 4, 2025

ఆలోచనకే తెలియని కార్యాలు ప్రకృతికే తెలిసేలా కార్యాలు విశ్వంలో ఎన్నో సాగుతున్నాయి

ఆలోచనకే తెలియని కార్యాలు ప్రకృతికే తెలిసేలా కార్యాలు విశ్వంలో ఎన్నో సాగుతున్నాయి  


-- వివరణ ఇంకా ఉంది!