కాల సమయం ప్రకృతికి ఏనాడు వృధా కాదు
జీవించే జీవులకే ఎంతో కాల సమయం వృధా అవుతుంటుంది
జీవుల ఆలోచనలు (భావ తత్వాలు) ఏ కార్యానికై ఆలోచిస్తూ ఉంటాయో వేటిని అవగాహన చేస్తూ అర్థాన్ని గ్రహిస్తూ ఉంటాయో కాల సమయానికే తెలుసు
విజ్ఞానంతో అజ్ఞానంతో తెలిసి తెలియక ఆలోచిస్తూ ఎన్నో జీవులు ఎన్నో సమయాలలో ఎన్నో విధాలుగా ఎంతో కాల సమయాన్ని వృధా చేస్తుంటాయి
కాల సమయం వృధా ఐతే ప్రకృతికి ఎటువంటి నష్టం ఉండదు
ప్రకృతి తనకు తానుగా ఎన్నో కార్యాలతో మిళితమై ఎన్నో విధాలా పంచభూతాల స్థితులతో జరిగిపోతుంటాయి
సమయాన్ని ఉపయోగించుకోలేకపోతే మానవులకు విజ్ఞానం ఆరోగ్యం ఐశ్వర్యం అభివృద్ధి విజయం ఎలా ఎన్నో వృధా అవుతాయి
ఇతర జీవులకు సమయం వృధా ఐతే ఆహారం కొరతగా ఏర్పడవచ్చు లేదా అందకుండాపోవచ్చు (అందుబాటులో ఉన్నది దక్కకుండా పోవచ్చు)
వీలైనంత వరకు విజ్ఞానంతో నైపుణ్యంతో జాగ్రత్తతో ఎరుకతో శ్రమిస్తూనే ఉండాలి ప్రతిఫలాన్ని పొందుతూనే ఉండాలి
-- వివరణ ఇంకా ఉంది!
No comments:
Post a Comment