Wednesday, October 29, 2025

అద్దెలతో మిద్దెలను నిర్మిస్తూ అంతస్తులు ఆకాశాన్ని చేరుతూ జీవితం అద్దెలతోనే సరిపోతున్నది

అద్దెలతో మిద్దెలను నిర్మిస్తూ అంతస్తులు ఆకాశాన్ని చేరుతూ జీవితం అద్దెలతోనే సరిపోతున్నది  

శ్రమించిన ఫలితమంతా అద్దెలతో సరిపోతే కుటుంబం అభివృద్ధి చెందేది ఎప్పుడో 

అద్దెలు మిద్దెల నిర్మాణానికి సరిపోయే విధంగా పెరుగుతూపోతే అద్దెలు ఆకాశాన్ని చేరుకుంటున్నాయి 

ఇల్లు లేని వారు ఉద్యోగ రిత్యా శ్రమించుటలో ఫలితం అద్దెలకు సరితూగుతున్నది జీవనం ఖర్చులతో ప్రయాణ దూరాలతో భారమవుతున్నది 


ధరలు పెరిగినా జీతాలు పెరగవే - జీతాలు పెరిగినా ధరలు ఆకాశాన్ని చేరునే 

ఉన్నవారికి ధరలు ఎలా ఉన్నా జీవనం సాగుతుంది 
లేనివారికి ధరలు ఎలా ఉన్నా జీవనం సంకోచిస్తుంది 

జీవన విధానమంతయు ధరలతోనే సాగుతున్నది 
ఆహారం వైద్యం విద్య వసతి ప్రయాణం అన్నీ అధిక ధరలతో వివిధ రూపాలతో అనేక విధాలుగా పరిణామాలు చెందుతూ పోతున్నాయి 

మనిషి జీవించుటలో కూడా ధర ఉన్నది - ధర లేని శ్వాస మానవునికి కరువాయే - స్వచ్ఛమైన శ్వాస జీవిత కాలమంతా అందకపోయేనే 


-- వివరణ ఇంకా ఉంది!

No comments:

Post a Comment