ఒక ప్రశ్నకు సమాధానం ఒక పుస్తకం కావచ్చు కాని మనం చదవం చదవలేక పోవచ్చు
ఒక ప్రశ్నకు సమాధానం మనం పుస్తకంలా వ్రాసుకోవచ్చు కాని దానిని కొన్ని సమయాలలో పూరించుకోలేము
సమాధానం తెలిసినా చేయలేని కార్యాలు ప్రశ్నగా మిగిలిపోతాయి అలాగే ఇతరులు ప్రశ్నిస్తూనే ఉంటారు
సమాధానం మనం ఇవ్వగలిగినప్పుడు కార్యం పూర్తవుతుంది ప్రశ్నకు ఉత్తరం పూరించబడుతుంది అప్పుడే మనస్సు ప్రశాంతంగా ఉంటుంది కార్య ఫలితం లభిస్తుంది
ప్రశ్న ఉన్నంతవరకు మనస్సు మేధస్సు అదోలా ఉంటుంది దేహం ఆరోగ్యం అదోరకంగా ఉంటుంది కొన్ని కార్యాలపై సరైన ఏకాగ్రత వహించదు ఆలోచన లను ప్రశ్న వేధిస్తూనే ఉంటుంది
ప్రశ్నకు సమాధాన కార్యం జరగాలి ప్రతిఫలం లభించాలి అప్పుడే మేధస్సు ఉత్తేజమై జీవితం అభివృద్ధి చెందుతుంది ఇతరుల ఆదరణ లభిస్తుంది సరైన బంధం సాగుతుంది
ఎన్ని ప్రశ్నలు వేసుకుంటే అన్ని ప్రశ్నలకు ఎన్నో సమాధానాలు ఎన్నో పుస్తకాలు వ్రాసుకోవాలి చదువుకోవాలి అలాగే కార్యాలను ఎన్నో ప్రయత్నాల సాధనతో సాధిస్తూ సమాధానాలతో ప్రతిఫలాన్ని దక్కించుకోవాలి
ఒక ప్రశ్నకు సమాధానం పుస్తకంలో ఉండవచ్చు లేదా ఆలోచనలో ఉండవచ్చు లేదా ప్రయత్నించే కార్యంలో ఉండవచ్చు లేదా వివిధ మార్గాలలో ఉండవచ్చు
-- వివరణ ఇంకా ఉంది!
No comments:
Post a Comment