మరణం ఎంతటి భావమో తెలిసిన వారికి ఎంతటి తత్వమో
జీవించుటలో ఎంతటి ధైర్యమో ప్రయాణించుటలో ఎంతటి సామర్థ్యమో
మరణం తపించుటలో మేధస్సుకు ఎంతటి తారసమో
మరణం సహించుటలో మనస్సుకు ఎంతటి సమన్వితమో
మరణంతో ఎన్ని బంధాలు దూరమవ్వునో ధ్యాసకు తెలియకపోవునే
మరణంతో ఎన్ని కార్యాలు ఆగిపోవునో శ్వాసకు తెలుపకపోవునే
మరణించుటచే ఎంతటి కార్య ఫలితం నిలిచిపోవునేమో
మరణించుటచే ఎంతటి కార్య సిద్ధాంతం తెలియకపోవునేమో
మరణం వరమై చేరగా శ్రమించుటలో ప్రశాంతత కలుగునేమో
మరణం భారమై చేరగా ప్రయాణించుటలో (ప్రతిఘాతన) ప్రమాదం చేరిపోయేనేమో
మరణం ఉందని తలచకు విజ్ఞానం ఉందని శ్రమించడం నిలుపకు
మరణం లేదని తెలుపకు విజయం ఉందని సాధించడం విడువకు
-- వివరణ ఇంకా ఉంది!
No comments:
Post a Comment