ఇంతవరకు ఏ విజ్ఞానం చెందలేదా ఏదీ నేర్చుకోలేదా ఏ కార్యాన్ని గమనించలేదా
ఆలోచనలతోనైనా జీవించలేదేమో భావ తత్వాల అవగాహన కూడా మేధస్సులో లేదేమో
శరీరంతో జీవిస్తున్నట్లు మనస్సుకు కూడా తెలియదేమో కనిపిస్తున్నదంతా నేత్ర దృష్టిగా గోచరించలేదేమో
జ్ఞానేంద్రియాలైనా కాలంతో జీవించుటలో మార్పు కలిగించలేదేమో జీవ ప్రక్రియలకు నవ నాడులు స్పందించలేదేమో
ఏ ప్రదేశంలో ఏ అనుభవం ఏనాడు కలగలేదేమో ఏ మార్గంలో ఏ బంధం ఏ జీవం ఏ స్పర్శను ఏ విధంగా కలిగించలేదేమో
తెలుసుకో ప్రతి కార్యాన్ని గమనించవా ప్రతి కదలికను అవగాహన చెందవా నీ రక్షణ జీవితం కోసం నీ వారి ప్రశాంతత కోసం
-- వివరణ ఇంకా ఉంది!
No comments:
Post a Comment