జీవితమంతా శ్రమిస్తున్నదంతా కేవలం ఐశ్వర్యం కోసమేనా
ఐశ్వర్యాన్ని ఆర్జనము చేయడంలోనే విజ్ఞానం ఆరోగ్యం అనుభవం అభివృద్ధి ప్రశాంతతలు దాగి ఉన్నాయిగా
ఐశ్వర్యంతోనే కార్యాలను సాగిస్తూ ఎన్నింటినో గమనిస్తూ ఎన్నో నేర్చుకుంటా ఎన్నో విధాలా జీవితాన్ని అభివృద్ధి చేసుకుంటూ తరతరాలుగా సాగిపోతున్నాము
ఆహారం అందుబాటులో ఉంటే శ్రమించే సామర్థ్యం మేధస్సులో ఉత్తేజమై కార్యాలను సాగించే ఆలోచనలు అవలీలలుగా కలుగుతాయి విజ్ఞానాన్ని గ్రహిస్తూ అనుభవాలతో అభివృద్ధిని సాధిస్తాయి
ఆహారానికి ఐశ్వర్యం ఎల్లప్పుడూ ప్రతి మనిషికి ఉండాలి అప్పుడే ప్రతి మానవుడు సంతోషంగా శక్తి సామర్థ్యాలతో శ్రమిస్తూ కుటుంబాన్ని అభివృద్ధి వైపు నడిపిస్తాడు
-- వివరణ ఇంకా ఉంది!
No comments:
Post a Comment