సూర్యోదయంతో విశ్వమంతా మహోదయమైన అనంతమైన దివ్యమైన ఔషధాలు ప్రకృతి ప్రభావాలతో విస్తరించుకుంటాయి
ఔషధములన్నీ కాల సమయంతో పాటు పంచభూతాల ప్రభావాలతో విశ్వ ప్రదేశమంతా వ్యాపిస్తూ ఉంటాయి
మహోదయమైన ఔషధాలు జీవులన్నింటికీ శక్తి సామర్థ్యాలను అందిస్తూ అద్భుతమైన కార్యాలను ఆరోగ్యంతో సాగిస్తూ జీవన విధానాన్ని మెరుగుపరుస్తాయి బంధాలను అభివృద్ధి చేస్తాయి
సూర్యోదయంతో ఏర్పడే ఔషధాలు ప్రకృతిలో వివిధ పరిణామాలతో వివిధ ప్రభావాలతో అభివృద్ధి చెందుతూ జీవులకు వివిధ గుణాల స్వచ్ఛమైన నిర్మలమైన ప్రాణ వాయువులను అందిస్తుంది
సూర్యోదయ కాంతి తేజస్సుతో ప్రకృతి వివిధ ప్రక్రియలతో ఎదుగుతూ వికసిస్తూ నిర్మలమైన స్వచ్ఛమైన పరిమళమైన సుగంధాలను ప్రాణ వాయువులతో మిశ్రమం చేస్తూ జీవులకు ఆరోగ్యాన్ని ఉత్తేజాన్ని పరిశుద్ధమైన ప్రభావాలతో అందిస్తుంది
సూర్య ప్రకాశంతో విశ్వం నిర్మలమై ఆకాశ ప్రదేశమంతా మహోదయమై జీవులకు ఉత్తేజాన్ని కలిగిస్తూ మేధస్సుకు నవ భావ తత్వాలను కలిగిస్తూ వివిధ కార్యాలను సాగించేందుకు సహకరిస్తుంది
-- వివరణ ఇంకా ఉంది!
No comments:
Post a Comment