Monday, October 27, 2025

ఓ పరమాత్మా! ప్రతి అణువు యోక్క నీ భావ తత్వములను సురక్షితంగా విశ్వ మేధస్సులో దాచి ఉంచాను

ఓ పరమాత్మా! ప్రతి అణువు యోక్క నీ భావ తత్వములను సురక్షితంగా విశ్వ మేధస్సులో దాచి ఉంచాను  

ఏ అణువు ఏ భావ తత్వములతో ఎలా జీవించునో వివిధ కాల సమయంతో సహా విశ్వ మేధస్సులో చేర్చుతున్నాను  

జీవుల భావ తత్వములు పరిశుద్ధమైతే నీకు పరిశోధన ప్రమేయ స్పందన కలిగించునని విశ్వ మేధస్సులో విడివిడిగా  కలుపుతున్నాను 

వివిధ ప్రళయములు ప్రకృతి తాండవ బీభత్సములు పంచభూతాల అవతారములతో సహా విశ్వ మేధస్సులో విజ్ఞాన అనుభవాలకై దాచేస్తున్నాను 

సంగీత వాద్యములు సర్వ స్వర గీతములు జీవములకు ప్రశాంతముగా ప్రకృతికి హాయిగా ఉండునని విశ్వ మేధస్సులో జత చేర్చాను 

ప్రకృతి శాస్త్రీయ సిద్ధాంతములు విజ్ఞాన సూత్రములు విభిన్న నైపుణ్యాలు నిర్మాణ ప్రణాళికలు సర్వం విశ్వ మేధస్సులో దృఢంగా భద్రపరిచాను 

సూర్యోదయ కిరణాల ఉత్తేజ ప్రకాశములు మేఘ వర్ణములు అంతరిక్ష కాంతులు గ్రహాల పరిభ్రమణాలు  అపురూపమైన అమూల్యమైన ప్రదేశములు ఖనిజములు వనరుల ఋతువుల పంచభూతాల ఆకార రూపాల భావ స్థితి తత్వములను సుదీర్ఘ కాలంగా యుగయుగాలకు జ్ఞానేంద్రీయ విచక్షణ జ్ఞాన గ్రంథంగా విశ్వ మేధస్సులో సర్వం సిద్ధ పరిచాను 

-- వివరణ ఇంకా ఉంది!

No comments:

Post a Comment