Friday, October 31, 2025

ఏ భావ తత్వాలతో మరణాన్ని గుర్తించెదవు

ఏ భావ తత్వాలతో మరణాన్ని గుర్తించెదవు ఎలా గ్రహించెదవు ఎలా తెలిపెదవు ఎలా తొలగించుకొనెదవు  
ఏ భావ తత్వాలతో మరణాన్ని గుర్తించినా శ్వాసపై ధ్యాసతో గమనం ఉంచితే కాస్త ఊరట కలుగుతుంది 

మరణం సంభవిస్తున్నా దేహపు అనారోగ్యాన్ని అస్థ వ్యవస్థను మహోదయమైన భావ తత్వాలతో శ్వాస ప్రయాస ప్రభావంతో ఆరోగ్యాన్ని పొందుతూ కొంత సమయం కొంత కాలం జీవించవచ్చు 

జీవించుటలో కొన్ని జాగ్రత్తలు కొన్ని నియమాలు పాఠిస్తే ఆరోగ్యంతో ఎక్కువ కాలం జీవించవచ్చు అనారోగ్య మరణాన్ని తొలిగించుకోవచ్చు 

దేహాన్ని వివిధ ప్రమాదాల నుండి రక్షించుకోవాలి అలాగే దేహానికి సరైన సమయానికి ప్రశాంతమైన నిద్ర సామర్థ్యమైన విశ్రాంతి పరిశుద్ధమైన ప్రకృతి ఆహారం ఉండాలి అవసరమైన శ్రమయం ఉండాలి 
దినసరి కార్యాలతో తగిన వ్యాయామం శరీరానికి తగిన విధంగా చేయాలి సమస్యలను పరిష్కారించే విజ్ఞానం ఉండాలి 

సూర్యోదయాన ప్రతి రోజు ఉత్తేజవంతమైన ఆలోచనలు మెళకువలు దినచర్య కార్యక్రమాలు సాగేలా ఉండాలి అభివృద్ధిని సాధనతో అందుకోవాలి సద్గుణమైన అలవాట్లను అలవర్చుకోవాలి గుణవంతుడిగా సత్ప్రవర్తనతో జీవించాలి క్రమశిక్షణతో జీవితాన్ని మెరుగుపరుచుకోవాలి 


-- వివరణ ఇంకా ఉంది!

No comments:

Post a Comment