11, మే 2026, సోమవారం

గాలి ఎప్పుడు ఎక్కడ నుండి ఎంత వరకు ఎంతటి వేగంతో ఎలా వీస్తుందో ఎవరికి తెలుసు

గాలి ఎప్పుడు ఎక్కడ నుండి ఎంత వరకు ఎంతటి వేగంతో ఎలా వీస్తుందో ఎవరికి తెలుసు  
విశ్వమంతా వీచే గాలి తేలికగా ఉంటే శ్వాసకు కూడా తెలియకుండా వీస్తుంది స్పర్శకు కూడా అందకుండా వెళ్ళిపోతుంది 

గాలి వేగం కూడా భీభత్సమైతే భయంకరంగా ఉంటుంది బహు విధాలుగా వివిధ ధ్వనులతో చిందరవందరగా  వీస్తుంది 

శ్వాసకు కూడా గాలి (ప్రకృతి నుండి వీచే ప్రాణ వాయువు) అందకపోతే దేహం తల్లడిల్లై పోతుంది 

చుట్టూ ఉన్న ప్రదేశం పరిశుద్ధంగా ఉంటే గాలి లేకున్నా దేహమే ఉచ్చ్వాస నిచ్చ్వాసాలతో శ్వాసలో గాలిని గ్రహిస్తుంది శరీరం కొంత సమయం ఓర్చుకుంటుంది 

నీటిలో కూడా గాలి ఉందని శ్వాసకు తెలుసు త్రాగినప్పుడు దేహం గ్రహించును [పరిశుద్ధమైన నీరు త్రాగాలి]

మన చుట్టూ ఉండే నీటిని (బావులు చెరువులు సరస్సులు కాలువలు జలాశయాలు నదులు సముద్రాలు) పరిశుద్ధంగా ఉంచుకోవాలి నీటితో వీచే గాలి కూడా ఎంతో ప్రాణవాయువుగా శరీరాన్ని చేరినప్పుడు దేహాన్ని శాంతింపజేస్తుంది 

జలపాతాలు ఎల్లప్పుడూ పరిశుద్ధంగానే ఉంటాయి వర్షపు నీరు కూడా పరిశుద్ధంగా ఉంటాయి 
వర్షపు నీటిని నిల్వచేసుకొనుటలో పరిశుద్ధంగా ఉంచుకోవాలి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి 

పంచభూతాలలో వివిధ రకాల గాలులు ఉన్నాయి వివిధ రకాలుగా వీస్తున్నాయి 

నేడు యంత్రముల నుండి వీచే గాలులను చాలావరకు ఆశ్వాదిస్తున్నాము ముఖ్యంగా గృహములలో సంస్థలలో 
ప్రయాణించుటలో కలిగే వేగపు గాలులు కూడా ఒక విధమైనవిగా వీస్తూ కలుగుతాయి  

యంత్రముల నుండి కాలుష్యమైన గాలులు కూడా వీస్తూ అనారోగ్యాన్ని కలిగిస్తున్నాయి 


-- వివరణ ఇంకా ఉంది!

ఎంత చదువుకున్నా విజ్ఞానం ఐశ్వర్యాన్ని కలిగించకపోతే ప్రయోజనం ఏమున్నది

ఎంత చదువుకున్నా విజ్ఞానం ఐశ్వర్యాన్ని కలిగించకపోతే ప్రయోజనం ఏమున్నది  
ఎంత నేర్చుకున్నా సమయానికి జ్ఞాపకం కలుగకపోతే అర్థాన్ని గ్రహించుటలో ఏమున్నది 

చదువుటలో ఉన్న ఏకాగ్రత నేర్చుకొనుటలో ఉన్న అర్థం జ్ఞాపకశక్తిగా మేధస్సులో నిలవాలి 

పదిహేను సంవత్సరాలు చదువుకుంటూ నేర్చుకుంటూ జ్ఞాపకశక్తిని పెంచుకుంటూ సాగుటలో ఉన్న పరమార్థం విజ్ఞానంతో పాటు ఐశ్వర్యాన్ని కూడా సంపాదించుకోవడమే 

విజ్ఞానం లేకున్నా అర్థమయ్యేలా ఎవరైనా కొంత సమయం బోధిస్తారు 
ఐశ్వర్యం లేకపోతే ఎవరైనా జీవ బంధం ఉన్నంతవరకు ఇవ్వగలరా చూసుకోగలరా 



-- వివరణ ఇంకా ఉంది!

శ్రమించకపోతే మరణం కలుగుతుందని నిరంతరం శ్రమిస్తున్నా

శ్రమించకపోతే మరణిస్తానేమోనని మేధస్సులో ఆలోచన కలుగుతున్నది  

శ్రమించకపోతే ఆరోగ్యం కూడా అనారోగ్యమై స్వయంకృత కార్యాలను కూడా చేసుకోలేక పోతానేమో 

శ్రమించలేనప్పుడు ఐశ్వర్యం కలిగేదెలా ఆహారం లభించేదెలా కుటుంబం సాగేదెలా బంధం నిలిచేదెలా  

అనారోగ్యంతో ఉన్నా ఆరోగ్యం పొందాలని కాస్త తేలికైన వ్యాయాయం చేస్తూ వివిధ కార్యాలతో సాగుతున్నా 

సూర్యోదయంతో ఉత్తేజమై మరణం లేకుండా అనేక కార్యాలతో సాగుతూ కుటుంబం అభివృద్ధికై జీవిస్తున్నా 

శ్రమించటంతోనే సర్వాన్ని గ్రహిస్తూ అవసరమైన వాటిని సమకూర్చుకుంటున్నా 


-- వివరణ ఇంకా ఉంది!


10, మే 2026, ఆదివారం

ఓ సూర్య దేవా! నా శరీర భాగాలను నీ స్వశక్తితో సూర్యోదయాననే ఆరోగ్యంగా మార్చవా

ఓ సూర్య దేవా! నా శరీర భాగాలను నీ స్వశక్తితో సూర్యోదయాననే ఆరోగ్యంగా మార్చవా  
నా శరీర భాగాలు సహనం లేక దేహ సామర్థ్యం లేక అనారోగ్యంతో దిన చర్య కార్యాలను నిర్వర్తించలేక పోతున్నాయి 

సూర్యోదయంతో నా కార్యాలను నేను పరిశుద్ధమైన ఆరోగ్యంతో మహా సామర్థ్యంతో ప్రారంభించాలి 
సూర్యోదయంతో నా స్వశక్తితో నా కార్యాలను నేను సమర్థంగా పరిపూర్ణంగా విజ్ఞానంతో నిర్వర్తించాలి 

ప్రతి జీవి ఆరోగ్యం సూర్యోదయాననే పరిపూర్ణమై స్వశక్తితో దిన చర్య కార్యాలతో సాగుతూ జీవించాలి 


--  వివరణ ఇంకా ఉంది!

8, మే 2026, శుక్రవారం

విశ్వ విజ్ఞానమంతా మేధస్సులో పరిభ్రమణం చేసే విధానం పర బ్రంహకే తెలియని పరిశోధనం

విశ్వ విజ్ఞానమంతా మేధస్సులో పరిభ్రమణం చేసే విధానం పర బ్రంహకే తెలియని పరిశోధనం  


-- వివరణ ఇంకా ఉంది!

శ్వాసనే ఆహారంగా చేసుకుని జీవించే యోగం బ్రంహకే తెలియని జీవ సంయోగం

శ్వాసనే ఆహారంగా చేసుకుని జీవించే యోగం బ్రంహకే తెలియని జీవ సంయోగం  

ఆహారం లేని సమయం శ్వాస ప్రయాస పరిశోధించి గమనం మనస్సుకే తెలియని దేహ విధానం 

శ్వాసనే సామార్థ్యంగా తలచి సాధన చేసే కార్యం యోగానికి తెలియని భావాల జీవ ప్రభావం 


-- వివరణ ఇంకా ఉంది!

యంత్రములు పనిచేస్తున్నంత వరకు మానవుడు నిద్రించడు

యంత్రములు పనిచేస్తున్నంత వరకు మానవుడు నిద్రించడు  

యంత్ర పని తీరు విధానం మొదలైనప్పటి నుండి మానవుని నిద్రించే విధానం మారిపోయింది ఆరోగ్య సామర్థ్యం తగ్గిపోయింది 

యంత్రదర్శిని ద్వారా మానవుని జీవన విధానం చాలా వరకు మారిపోయింది 

మానవుడు చేసే చాలా కార్యములు యంత్రముల నుండే సాగిపోతున్నాయి 

యంత్రములు సృష్టించినప్పటి నుండి మానవుని ఉద్యోగాలు కూడా రాత్రివేళలో సాగుతున్నాయి 

మానవుని కళా పోషణ యంత్ర పోషణగా (ఉత్పత్తి) మారిపోయినది 

యంత్రముల ద్వారా యజమానికి లాభదాయకం కార్మికునికి ఆరోగ్య సమస్య కలగడం జరుగుతున్నది 

మానవుని విజ్ఞానం మంత్రమై యంత్రమై సాగుతున్నది జీవన విధానం మారిపోతున్నది 


-- వివరణ ఇంకా ఉంది!

శ్వాస ప్రయాసను ఉచ్చ్వాస నిచ్చ్వాసాలతో శరీరం అంచుల దాకా వ్యాపింపజేయాలి

శ్వాస ప్రయాసను ఉచ్చ్వాస నిచ్చ్వాసాలతో శరీరం అంచుల దాకా వ్యాపింపజేయాలి  

శ్వాస శరీరమంతా వ్యాప్తి చెందినప్పుడు శరీర భాగాలన్నీ ఉత్తేజమై ఆరోగ్యంగా పనిచేస్తాయి 

శరీరంలో ఎన్నో కణాలు శ్వాస ప్రయాస ద్వారా ఉత్తేజమై శరీరాన్ని సామర్థ్యంగా ఉంచుతాయి 

ఉచ్చ్వాస నిచ్చ్వాసాల శ్వాస ప్రయాస రక్త ప్రసరణ ద్వారా శరీరమంతా వ్యాప్తి చెందగలదు 


-- వివరణ ఇంకా ఉంది!

7, మే 2026, గురువారం

ఈనాటిది ఏదీ నీకు తెలియదా ఏనాటిది ఏదీ నీవు తెలుసుకోలేదా

ఈనాటిది ఏదీ నీకు తెలియదా ఏనాటిది ఏదీ నీవు తెలుసుకోలేదా 
ఏదీ తెలియకపోయినా జీవించుటకు కావలసిన జీవన విధానాన్ని తెలుసుకొని జీవితాన్ని సాగించాలి  

కావలసిన విజ్ఞానాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకొని నేర్చుకొని ప్రయోజనంతో ముందుకు సాగిపోతే జీవితం విజ్ఞానంతో అభివృద్ధి చెందుతుంది  


-- వివరణ ఇంకా ఉంది!

మానవుడిగా ఎన్ని శిక్షలు తప్పించుకున్నా మరణ శిక్ష తప్పదుగా

మానవుడిగా ఎన్ని శిక్షలు తప్పించుకున్నా మరణ శిక్ష తప్పదుగా  
జీవించుటలో ఎందరో ఎన్నో తప్పులు చేసినా శిక్షలు ఉండకపోవచ్చు తప్పించుకోవచ్చు అందుకే ప్రతి జీవికి మరణం ముగింపు 

తప్పుకు వేసే శిక్ష శిక్షణగా అనుభవించవచ్చు అప్పుడే తప్పును తెలుసుకొని మళ్ళీ జరగకుండా చూసుకోవచ్చు 
తప్పు వలన ఎన్నో సమస్యలు ఆటంకాలు ఇబ్బందులు కలగవచ్చు అలాగే మరెన్నో తప్పులు జరుగుతూ ఎన్నో సమస్యలు సంభవించవచ్చు 

తప్పుకు శిక్షలు వేసేవి ఉంటాయి లేదా వేయకుండా సాగేవి ఉంటాయి లేదా తెలియకుండా పోయేవి ఉంటాయి లేదా శిక్ష వేసినా తప్పించునే వారు ఉంటారు అలాగే తప్పించే వారు ఉంటారు అలాగే మరచిపోయేవారు ఉంటారు 

ఏ తప్పు చేసినా విజ్ఞానాన్ని హితాన్ని గ్రహించాలి సత్ప్రవర్తనతో సాగాలి తప్పును సరిదిద్దుకోవాలి 

ఎప్పుడో చేసిన తప్పును ఎప్పుడో ఎవరో తెలుసుకుంటే శిక్ష వేయడానికి మానిషి ఉండకపోవచ్చు (మరణించి ఉండవచ్చు)

తప్పులు జరగడం సహజం దానిని సరిచేసుకోవడం మానవ ధర్మం 
తప్పుల వల్ల కలిగే నష్టాలను వివరించి అనుభవాలను పంచి (బోధించి) సరైన మార్గంలో నడిచేలా చేయడం గొప్పతనం 

ఒక తప్పు వల్ల ఇంకొకరికి శిక్ష పడవచ్చు (చేసిన వారికి శిక్ష పడకుండా ఇంకొకరికి లేదా కుటుంబానికి లేదా ఇతరులకు శిక్ష పడవచ్చు)
చేయని తప్పుకు శిక్ష అనుభవించడం వలన గౌరవం అభివృద్ధి కలగకపోవచ్చు జీవితం వృధా కావచ్చు జీవించుటకు మంచి అవకాశములు లేకపోవచ్చు కలగకపోవచ్చు 

ప్రతి మానవుడు ప్రతి కార్యాన్ని విజ్ఞానంతో చేయడానికి శ్రద్ధ వహించాలి శిక్షణ తీసుకోవాలి 
కార్యాలను కార్యక్రమంగా ఒక దాని తర్వాత ఒక కార్యం క్రమక్రమంగా జరిగేలా చేసుకోవాలి 

కార్యం ఎలా చేయాలో కార్యక్రమ నియమాలను క్రమక్రమంగా కార్యాచరణతో పాటించాలి అప్పుడే కార్యంలో ఎటువంటి అజ్ఞానం అజాగ్రత్త అశుద్ధత అపార్థం ఉండవు 

ఏ కార్యం తర్వాత ఏ కార్యం చేయాలో తెలుసుకోవాలి అప్పుడు కార్యక్రమం తెలుస్తుంది సత్ఫలితం లభిస్తుంది 


-- వివరణ ఇంకా ఉంది!