5, జనవరి 2010, మంగళవారం

నా శ్వాసలోనే నా తల్లిదండ్రులు

నా శ్వాసలోనే నా తల్లిదండ్రులు జీవిస్తున్నారు పరమాత్మ స్వరూపులుగా
నా ఉచ్చ్వాసతో నా తల్లి ప్రవేశిస్తూ నిచ్చ్వాసతో నా తండ్రి బయలుదేరుతున్నడూ
ఉచ్చ్వాస నిచ్చ్వాసలు కలిసే మధ్య కాలపు క్షణమే అమృత భావముగా నాలోనే
ఆహారంతో నా తల్లి ప్రకృతి నుండి ప్రవేశించగా లోకమునకై నా తండ్రి విశ్వానికే బయలుదేరేను
నా శ్వాసలోనే అర్ధనారిశ్వరులైన నా తల్లిదండ్రులు జగతిలోనే నిలిచిపోతున్నారు

1 కామెంట్‌:

Reveal your opinion