Saturday, February 7, 2026

ఆకులు లేకున్నా (రాలిపోతున్నా) పుష్పాలు వికసిస్తాయి

ఆకులు లేకున్నా (రాలిపోతున్నా) పుష్పాలు వికసిస్తాయి 
పుష్పాలు లేకున్నా ఆకులు చిగురిస్తాయి
(పుష్పాలు వికసించుటకు ముందు ఆకులు చిగురిస్తాయి - పుష్పాలను చూడక ముందే (పుష్పాలు వికసించక ముందే) కొన్ని రకాల చెట్టుల ఆకులు (ఎండిపోయి గాలికి) రాలిపోతాయి)

ఆకులు ఉంటేనే కొమ్మలు పెరుగుతాయి (ఎదుగుతాయి)
కొమ్మలు ఎదుగుతూ ఉంటేనే చెట్టు కాండం బలంగా ఉంటుంది 

చెట్టు కాండం (మొదలు, బోదె, వృక్ష స్తంభం)

చెట్టు కాండం ఎదుగుతున్నంత కాలం వేర్లు బలంగా ఉంటాయి 
వేర్లు భూగర్భంలో ఎదుగుతున్నంత కాలం చెట్టు వృక్షమవుతూ కొమ్మల ఆకుల చిగుర్లతో హాయిగా జీవిస్తూ పుష్పాలను వికసింపజేస్తుంది కాయలను పండ్లుగా మార్చుతుంది 


జీవితాలు కూడా ఎలా సాగిపోతాయి మనకు అర్థమయ్యేలా వృక్షాలు ఎన్నో బోధిస్తాయి 


-- వివరణ ఇంకా ఉంది!

No comments:

Post a Comment