Thursday, February 12, 2026

మనం జన్మించక ముందే మన కోసం ఎంతో సృష్టించబడింది ఎంతో విజ్ఞానం ఏర్పడింది

మనం జన్మించక ముందే మన కోసం ఎంతో సృష్టించబడింది ఎంతో విజ్ఞానం ఏర్పడింది 
మన కోసం ఎందరో ఎన్నో త్యాగాలు చేస్తూ విజ్ఞానాన్ని అందిస్తూ ఇంకా ఎందరో ప్రతి రోజు నీ కోసం జీవిస్తూనే ఉన్నారు 

మన కార్యాలకు ఉపయోగపడే వారంతా మన కోసం ముందే జన్మించి ఎన్నో చేసుకుంటూ వస్తున్నారు మన తర్వాత జన్మించిన వారు కూడా మన కోసం ఎన్నో చేస్తూ సాగుతున్నారు 

మనం కూడా ఉన్న వారికి ఏదో చేస్తూ సాగుతూ మన తర్వాత వచ్చే వారికి ఎన్నో చేస్తూ సాగిపోవాలి 

మనకోసం విశ్వం పంచభూతాలు విజ్ఞానం ప్రకృతి భావ తత్వాలు శాస్త్రీయ సిద్ధాంతాలు ఎన్నో సృష్టించబడ్డాయి ఎన్నో రూపకల్పనలు నిర్మాణాలు సాగుతున్నాయి ఎన్నో జీవరాసులు మన లాగే కాలంతో తరతరాలుగా సాగుతున్నాయి 

ఉపయోగకరమైనదానిని అభివృద్ధి చేసుకోవాలి ఉపయోగం లేనిది వదిలించుకోవాలి పరిశుద్ధమైన గుణ స్వభావ తత్వాలతో సత్ప్రవర్తనతో కార్యక్రమ శాస్త్రీయ సిద్ధాంతాలతో దేహాన్ని రక్షించుకుంటూ ప్రకృతి పూర్వకంగా ఆహార ఆరోగ్యంతో సాగుతూ శ్రమ సమయస్ఫూర్తితో జీవించాలి 


-- వివరణ ఇంకా ఉంది! 

No comments:

Post a Comment