Thursday, February 26, 2026

శ్రమించలేక పోతున్నానా శ్రమకే తెలియక పోతున్నానా

శ్రమించలేక పోతున్నానా శ్రమకే తెలియక పోతున్నానా  

శ్రమించుటలో ఫలితం లేకపోతే శ్రమించుట తెలియదేమోనని అనుకుంటున్నా 
శ్రమించుటలో అనారోగ్యం నష్టం దుఃఖం కలుగుతుంటే శ్రమకు తెలియక పోతున్నానని అనుకుంటున్నా 

శ్రమను గుర్తించలేని వారు ఫలితాన్ని కూడా ఇవ్వలేరుగా కార్యాలను సాగించుటలో లాభాలే గాని మానవులు లేరుగా 
మానవుల శ్రమ వృధాగా మారుతూ కార్యాధికారి మాత్రమే లాభాన్ని పొందుతూ జీవిస్తున్నాడుగా 

శ్రమించే వారికి జీవితాలు లేవని ఫలితం ఇవ్వలేని కార్యాధికారి స్వభావ తత్వం స్వార్థ స్వసుఖమేగా 

నిరంతరమైన శ్రమకు ప్రతి ఫలం అనారోగ్యమేగా మిత్రమా 


-- వివరణ ఇంకా ఉంది!

No comments:

Post a Comment