ప్రతి మేధస్సు నీదైతే ప్రతి క్షణం దేనిని ఎలా ఆలోచిస్తావు
ప్రతి మేధస్సు నీలోనే ఉన్నట్లు నీలో కలిగే భావన ఏది
ప్రతి మేధస్సులో ఆహార నిద్రలే కలగాలని ఆలోచిస్తావా
సుఖ సంతోషాల సౌకర్యాలతోనే కాలాన్ని గడిపేస్తావా
ప్రతి రోజు కలిగే విశ్వ కార్యాల సమస్యలను లెక్కిస్తున్నావా
అజ్ఞాన జ్ఞాన భావాలు ప్రమాదాలు ఆకాలి చావులెన్నో
జనన మరణాలు అసంఖ్యాక సమాజ విధానాలెన్నో
ఒక్కొక్క మేధస్సులో ఒక్కొక్క లోకాన్ని మార్చగలవా
ప్రతి మేధస్సును విజ్ఞానంగా దివ్య భావాలతో మార్చగలవా
మహా భావాల ఆలోచనల కోసం మహా ధ్యానం చేయగలవా
అన్ని మేధస్సులలో ఏకాగ్రతను విషయ అర్థాన్ని గమనించగలవా
ప్రతి జీవి మేధస్సును నీలాగే విజ్ఞానంగా ఆలోచింప జేయగలవా
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
Reveal your opinion