29, జూన్ 2011, బుధవారం

మహా దివ్య నక్షత్రమే నా మేధస్సును

మహా దివ్య నక్షత్రమే నా మేధస్సును విశ్వ భావాలతో ఆలోచించేలా నడిపిస్తున్నది

ఆత్మతోనే నేను నాలోనే నేనై

ఆత్మతోనే నేను నాలోనే నేనై ఆలోచిస్తూ జీవిస్తున్నాను
నా యందు ఎవరున్నా నాలో ఆత్మ యోగ ధ్యాసపు ఆలోచనలే

28, జూన్ 2011, మంగళవారం

మరో జన్మలో కలగని నేటి నా భావాలు

మరో జన్మలో కలగని నేటి నా భావాలు నాలోనే అంతరించిపోతాయేమో
నా భావాలు ఎప్పటికి నిలిచేలా ఆకాశానికే విశ్వ ధ్యాసతో అంకితం చేస్తున్నా

విశ్వానికి దూరమై పోతున్నా

విశ్వానికి దూరమై పోతున్నా విశ్వమంతా శూన్యమై పోతున్నా
విశ్వాన్ని వదిలి వెళ్ళిపోతున్నా విశ్వ రూపాలను వదిలి పోతున్నా
నాలోని భావాలకు నా జీవితం సరి లేదని మేధస్సు చింతిస్తున్నది
నా ఆలోచనలు నన్ను వేదిస్తున్ననందున విశ్వానికి దూరంగా వెళ్ళుతున్నా
నా రూపాన్ని ఆకారంగా వదిలేస్తూ పర ధ్యాసతో జీవించేలా ప్రాణమే వదిలేశా

27, జూన్ 2011, సోమవారం

జీవితాలు అర్థం కాకుండానే

జీవితాలు అర్థం కాకుండానే సాగుతాయని కాలమే నీకు తెలుపుతుంది
నీవు అనుకున్నవన్నీ నీకు తెలియకుండానే జరగకుండా వెళ్ళిపోతాయి
జరిగే సమయంలో ఇలా జరగాలనుకుంటే నీ వారు నిన్ను మార్చేస్తారు
నీవు కోరినవన్నీ జరగడానికి కొన్ని ఇబ్బందులను వివరిస్తూ వస్తారు
నీ కోరికల అంచనాలు పర ధ్యాసలోకి వెళ్లి పోయేలా నిన్నే మార్చేస్తారు
కార్యాలు సాగిన తర్వాత నీవేమి చేయలేక భాధతో జీవితాన్ని సాగించాలి
జరిగే అవకాశం నీలో ఉన్నా జరిపించే వారు నీకు అనుగుణంగా ఉండరు
కాలం విధి రాతయో జన్మ కర్మత్వమో నీ వారి సందిగ్ధమో అర్థం కాదు
విశ్వ విజ్ఞాన ఎరుక ఉన్నా నా అంచనాన్ని నా మేధస్సును అణచి వేశారు

24, జూన్ 2011, శుక్రవారం

విశ్వ కాలానికి దూరం ఏదీ లేదని

విశ్వ కాలానికి దూరం ఏదీ లేదని నా భావనకు తెలిసింది
విశ్వానికి కాలమే దూరమని క్షణ క్షణాలతో సాగిపోతున్నది

నీ మేధస్సులోనే విశ్వ విజ్ఞాన లక్ష్యం

నీ మేధస్సులోనే విశ్వ విజ్ఞాన లక్ష్యం ఉందని గ్రహించు
నీ ఆత్మ లక్ష్యం కోసమే జీవిస్తున్నావని నీవే తెలుసుకో
లక్ష్య సాధనకై విశ్వ విజ్ఞానాన్ని సర్వ విధానాలుగా అన్వేషించు
సర్వ భావాలతో నీ లక్ష్యాన్ని నీ జీవిత కాలంలోనే నెరవేర్చుకో
మరల రాని ఈ విజ్ఞాన అవకాశాన్ని నేడు గమనించి సాధించు

23, జూన్ 2011, గురువారం

కాలం ఎప్పుడూ ఒకేలా వెళ్ళిపోతున్నా

కాలం ఎప్పుడూ ఒకేలా వెళ్ళిపోతున్నా రోజులో తేడా లేదు
వాతావరణంలో ఉన్న తేడాయో జీవ సృష్టికి గొప్ప నిదర్శనం
కాలం వాతావరం మహా గొప్ప భావాలతో విశ్వాన్ని నడిపించును
వాతావరణ ప్రభావాలు సకల జీవులకు కాల విజ్ఞాన అనుభవాలు

విశ్వ విజ్ఞాన భావాలతో ఆత్మ

విశ్వ విజ్ఞాన భావాలతో ఆత్మ యోగత్వమైతే దేహం పరిశుద్ధమై మహా లోకాన్ని చేరును
ఆత్మ సహస్రార చక్రంతో పాద స్పర్శ నుండి శిరస్సు వరకు అజ్ఞాన పొరలను తొలగించును
మేధస్సులో విశ్వ భావ విచక్షణ కణాలు మహా దివ్య తేజస్సుతో నిత్య కాంతిని వరిస్తాయి
శరీరం మహా వేగంతో ప్రయాణిస్తూ సూక్ష్మ కణాలుగా విడిపోతూ శూన్యాన్ని చేరుతుంది
శూన్య స్థానమున ఆత్మ విశ్వ చైతన్యమై మహా విజ్ఞాన వేదత్వాన్ని సృష్టికి అందించును

22, జూన్ 2011, బుధవారం

దిక్కులు లేని దూర దర్శనమున

దిక్కులు లేని దూర దర్శనమున ఒక అణువుగా దిక్సూచివలె ఉన్నాను
మార్గం లేకున్నా గాలితో వెళ్లి ఓ మహా మర్మ గుహలో శూన్యమై చేరుకున్నా
విశ్వాన్ని తిలకించే ఆత్మ భావాలను విశ్వ తత్వాలచే శూన్యం చేసుకున్నాను
విశ్వానికి దూరంగా కనిపించని అణువుగా విశ్వ విజ్ఞానంతో ఎక్కడున్నానో