దేహం ఎంతటి విచిత్రమో దహనమవుతుందని తెలిసినా ధైర్యాన్ని ఇస్తున్నది
శరీరం ఎంతటి సామర్థ్యమో సహనాన్ని కోల్పోతున్నా ఆసక్తిని పెంచుతున్నది
శ్వాస ఎంతటి దృఢమో గాలిలో కలిసిపోతుందని తెలిసినా ఉచ్చ్వాస నిచ్చ్వాసాలతో ప్రయాసతో ఆర్భాటం చెందుతూ ఆశయం కోసం ఆసక్తిని పెంచుతున్నది
మేధస్సు ఎంతటి మాయామో అన్నీ తెలుసుకున్నా చేసిన కార్యాలనే మరచిపోతూ చేస్తున్నవాటినే గమనిస్తూ మంత్రమై మనస్సుతో మొహమాట పడుతున్నది
రూపం ఎంతటి స్వభావమో కనిపిస్తున్నది తన రూపమే ఐనా కనిపించకుండా మారిపోతుందని తన రూపాన్ని సుందరంగా మార్చుకుంటూ సుగంధాలతో వస్త్ర ఆభరణాలతో ప్రతి రోజు అలంకరించుకుంటుంది
నాదం ఎంతటి తత్త్వమో ఆగిపోతుందని తెలిసినా స్వరములతో ఎన్నో మాటలతో పరిచయాలతో బంధాలతో సంబంధాలను కలుపుకుంటూ ఎన్నో విషయాలను సాగిస్తూ పాటలతో కూడా మైమఱుపు కలిగిస్తుంది
మనస్సు ఎంతటి ప్రభావమో ఎప్పుడూ ఏదో ఒకటి కావాలంటూ ఎన్నో విధాల నేర్చుకుంటూ తెలుసుకుంటూ మోసపోతూ నష్టపోతూ సుఖ దుఃఖాలతో బాధ పడుతున్నా ఆవేదనతో ఆలోచిస్తూ కాలంతో సాగుతున్నది
శరీరం శ్రమించుటలో అలసిపోతున్నా దేహం శ్వాసతో అనారోగ్యం చెందుతున్నా చివరి క్షణం వరకు పోరాట పడుతున్నా బంధాలతో సాగిపోయే ఆశయమే జీవితం
-- వివరణ ఇంకా ఉన్నది!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి