ఒకప్పుడు ఒక్క రూపాయి కోసం ఎదురు చూసే వారం ఆ తర్వాత పది రూపాయల కోసం ఎదురు చూశాం
కొంత కాలం తర్వాత వంద రూపాయల కోసం అలాగే వెయ్యి రూపాయల కోసం ఎదురుచూస్తూ ఎదిగిపోయాం
నేడు వెయ్యి రూపాయల కోసం విజ్ఞానంతో శ్రమించుటకు ఎదురుచూస్తూ ఎక్కడ పని దొరుకుతుందో వెతుక్కుంటున్నాం
శ్రమతో పాటు జీతం వేలలో వస్తున్నా అలాగే ఎన్నో ఖర్చులతో చేతుల నుండి వెళ్ళిపోతుంటే వేదన పడుతున్నాం
పొదుపులతో ఎన్నో విధాలా దాచేసుకుంటూ లక్షలు ఉన్నాయని అనుకుంటూ సాగిపోతూనే కళ్యాణం జరిగిపోయి తరచుగా అప్పులు మొదలవుతున్నాయి
కొత్త బంధంతో కొత్త జీవితంతో అద్దెలు కడుతూ నష్టంతో సాగుతుంటే ఒక గృహాన్ని జీవిత లక్ష్యంగా చేసుకోవాలని విచారణ చేస్తుంటే గృహములు కోట్లను దాటేస్తున్నాయి
ఐశ్వర్యం కోసం ఎదురుచూస్తూనే ఆశయం కూడా దేనిని ఆశించలేక పోతున్నది ఆసక్తి అక్కడే అలసిపోతున్నది
విజ్ఞానం శ్రమ సామర్థ్యం ఉద్యోగం పొదుపు పెట్టుబడి కలసికట్టుగా త్వరపడుతూ సాగిస్తే ఒక గృహమైనా సొంతం కాగలదా అది ఎక్కడో ఇష్టంగా కలుగునా
-- వివరణ ఇంకా ఉన్నది!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి