3, ఆగస్టు 2026, సోమవారం

ఓ మాతృ దేవీ! ఎంతటి సహనాన్నివో ఎవరికీ తెలియని శ్రమ సామర్థ్యాన్నివో

ఓ మాతృ దేవీ! ఎంతటి సహనాన్నివో ఎవరికీ తెలియని శ్రమ సామర్థ్యాన్నివో  
ఆకలి లేని అమృతంతో బంధాన్ని అనుబంధంతో అమరం చేసిన త్యాగానివో 

ప్రతి రోజు ఆహారం ప్రతి పూట అమృతం ప్రతి సారి ఆప్యాయతతో ఆకలిని మరిపించావు 
ప్రతి రోజు మమకారం ప్రతి పూట మాధుర్యం ప్రతి సారి మనోహరంతో సమయాన్ని సాగించావు 

ఇంటిలో గర్భగుడిగా అన్నపూర్ణేశ్వరిగా కొలువై నిత్యం బంధాలకే అన్నదానం చేస్తున్నావు 
ఇంటిలో గృహాలక్ష్మిగా ధన్వంతరీశ్వరిగా నిలయమై బంధాలకే ఆరోగ్యం ప్రసాదిస్తున్నావు  

ఏ పరిస్థితిలో ఎలా ఉంటావో ఎవరికి తెలియదు ఎవరికీ తెలుపవు ఎవరిని గ్రహింపలేవు 
ఏ పరిస్థితి ఎలా ఉన్నా ప్రతి రోజు ఆహారాన్ని సమర్పించే అమృతవల్లిగా దర్శనమిస్తావు   


ఓ పితృ దేవా! తల్లిని తనయులకు (పిల్లలకు) తోడుగా ఉండేలా ఆకలిని తీర్చేలా ఇంటిలో వదిలేసి సమాజమంతా ప్రయాణిస్తూ వివిధ రకాలుగా శ్రమిస్తున్నావు 
ఉదయించుటలో బయలుదేరి విజ్ఞానంతో వివిధ రకాల సామర్థ్యంతో శ్రమించి సహించుకొని అస్తమించుటలో ఆపేక్షతో ఇంటిని చేరుకుంటావు  

ఎటువంటి ఆశయంతో ఎంత దూరం ప్రయాణిస్తావో ఎంతటి సామర్థ్యంతో ఎంత సమయం శ్రమిస్తావో ఎంతటి జ్ఞానంతో ఏ పని కోసం ఎందరిని వేడుకుంటావో 
ఎటువంటి లక్ష్యంతో ఎంతటి సాధన చేస్తూ ఎంత కాలం ఇలా శ్రమిస్తూనే ప్రతి రోజు ఇంటికి కావలసిన అవసరాలను అందరికి అన్ని విధాలా ఎల్లప్పుడూ తీర్చేస్తున్నావు 

అందరికి ఆహారం వసతి వస్త్రం సౌకర్యం రక్షణ సదుపాయంతో పాటు విజ్ఞానం ఆరోగ్యం అనుభవాలను నేర్పుతూ సమాజానికి ఒక శాస్త్రజ్ఞుడిని ఒక సేవకుడిని అందిస్తున్నావు 
అందరికి ఎదుగుదలతో పాటు ధైర్యం సామర్థ్యం శ్రమ సహనం సామర్థ్యం సమైక్యం సమస్యల పరిష్కారాలను వివరిస్తూ బోధిస్తూ ఒక మహానుభావుడిగా నిలుస్తున్నావు  

ఇంటిని అమృతాలయంగా మాతృత్వాలయంగా విజ్ఞానాలయంగా ఆరోగ్యాలయంగా గ్రంథాలయంగా దేవాలయంగా విద్యాలయంగా విశ్వాలయంగా మార్చుతున్నావు 
ఇంటిని ధైర్యాలయంగా రక్షణాలయంగా బంధాలయంగా జీవనాలయంగా జీవితాలయంగా సామర్థ్యాలయంగా శ్రమాలయంగా సహాయాలయంగా తీర్చుదిద్దుతున్నావు 

ఇంటితో పాటు సమాజాన్ని పరిశుద్ధమైన పర్యావరణంగా పరిపూర్ణమైన పరిమళాలతో పత్రహరిత పుష్పాలతో ప్రకృతిని ఆహార ఆరోగ్య సంపదగా సౌకర్యంగా అభివృద్ధి చేస్తున్నావు 
ఇంటితో పాటు గ్రామాన్ని నగరాన్ని సమాజాన్ని ప్రదేశాన్ని ప్రపంచాన్ని విశ్వమంతా విజ్ఞాన విజేతగా నిలిచి ఉండేలా విశ్వ కార్యక్రమాల పరోశోధన ఆరోగ్య రక్షం కోసం అభివృద్ధి చేస్తున్నావు 

-- వివరణ ఇంకా ఉన్నది!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి