31, మే 2010, సోమవారం

నా భావాన్ని తెలిపే శిల్పం ఏదీ

నా భావాన్ని తెలిపే శిల్పం ఏదీ శిలలో దాగిన స్వభావం ఏదీ
శిల్పానికి ఉపయోగించిన రాయి తత్వం ఏదీ దాని గుణం ఏదీ
శిలగా చెక్కే వేళ ముక్కలుగా చెదిరిన వాటిలో నా భావాలు ఏవీ
ఆ భావాలను కూడా తెలిపే మహా రూప శిల భావ స్వభావం ఏదీ
నాలోని తత్వం తెలిపే భావముగల శిల ఏ లోకాన లేదా కలగానైనా
నా భావాలను శిలలో తెలుపుటకే వీలుకాక విశ్వముగా నిర్మితమైనది
ఏ భావం కావాలన్నా విశ్వంలోనే అన్వేషించి సూక్ష్మముగా గ్రహించాలనే

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి