అజాగ్రత్త వల్ల అజ్ఞానం కలుగుతుంది జాగ్రత్త వాళ్ళ విజ్ఞానం పెరుగుతుంది (కలుగుతుంది)
అజాగ్రత్తకు ఎన్నో కార్యకారణాలు ఏకమై వచ్చేస్తాయి బీభత్సాన్ని సృష్టిస్తాయి
జాగ్రత్తకు ఎన్నో కార్యాచరణాలు అనేకమైనా భరించాలి సరైన వాటిని ఎంచుకోవాలి ఆచరించాలి
అజాగ్రత్తలో మన ప్రమేయం తక్కువగా ఉన్నా ప్రమాదం కలగవచ్చు
జాగ్రత్తలో మన ప్రమేయం ఎంత ఎక్కువగా ఉన్నా తక్కువగా అనిపిస్తుంది
మానవుడు జీవించుటలో కార్యాలు అనంతం అందులో జాగ్రత్తలు కూడా చాలా అవసరం అవి శరీర ఆరోగ్యానికి ప్రధానం
మానవుడు జీవించుటలో ఎంత విజ్ఞానం అనుభవం ఆచరణ నియమాలు ఎన్ని ఉన్నా కొన్ని సమయాలలో వివిధ కార్యాలతో అజాగ్రత్తల వల్ల ప్రమాదాలు ఏర్పడుతాయి నష్టాలు కలుగుతాయి ఎన్నో వృధా అవుతాయి ఎన్నో విధాల కాలుష్యములు పెరిగిపోతాయి ఎన్నో అశుభ్రతతో నిలిచిపోతాయి ఎన్నో జీవన విధానానికి ముప్పు వాటిల్లుతాయి కాల సమయంతో ఎన్నో సంభవిస్తాయి
-- వివరణ ఇంకా ఉంది!
No comments:
Post a Comment