Thursday, November 13, 2025

శ్రమించుటలో ఆరోగ్యం ఉండాలి ఆరోగ్యంతో శ్రమిస్తూ సాగిపోవాలి

శ్రమించుటలో ఆరోగ్యం ఉండాలి ఆరోగ్యంతో శ్రమిస్తూ సాగిపోవాలి  

ఆరోగ్యవంతమైన శ్రమలో విజ్ఞానం అధికమవుతూ కార్యాభివృద్ధి అద్భుతంగా జరగాలి ఆనందమైన ఫలితాన్ని ఇవ్వాలి 

విశ్వంలో జరిగే కార్యక్రమాలలో శ్రమించుటలో ఆరోగ్యం తగ్గిపోతూ అనారోగ్యం యౌవన (యవ్వన) వయస్సులోనే కలుగుతున్నది 

నేడు ఉపయోగించే ఖనిజాలు లోహాలు ముడి-పదార్ధాలు ఉత్పత్తి విధానంలో వివిధ రకాల రసాయన ద్రవ్యములు వివిధ రకాల కృత్రిమ పదార్థాలు తయారీ విధానంలో మనిషి ఆరోగ్యాన్ని క్షీణింపజేస్తున్నాయి 

మానవులకు కావలసిన వస్తువులు అనంతం అందుకు సృష్టించేవి అనంతానికే అనంతం అందుకే మాన విజ్ఞానానికి అదుపు లేదు అంతం లేదు నిరంతరం కొత్త కొత్త ఆలోచనలతో ఎన్నో నేర్చుకొని అవగాహన చేసుకొని కొత్త కొత్త ఉపాయలతో ఎన్నో ప్రయోగాలతో ఎన్నింటినో సృష్టిస్తూ వివిధ రకాల అనుభవాలతో వివిధ రకాలుగా వివిధ రూపాలతో వస్తువులను ఉత్పత్తి చేస్తున్నాడు 

మానవుడు జీవించుటలో విజ్ఞానానికి ఆహారానికి ఆరోగ్యానికి వస్త్రానికి ప్రయాణానికి పరిశుద్ధతకు ఉండడానికి నడవడానికి శ్రమించుటకు ఎన్నో వస్తువులు కావాలి అలాగే కాలా క్షేపానికి కూడా ఎన్నో వస్తవులు కావాలి 


-- వివరణ ఇంకా ఉంది!

No comments:

Post a Comment