Thursday, November 20, 2025

అక్షరాలకు బంధాలు పదాలుగా కుటుంబంగా సాగుతున్నాయి

అక్షరాలకు బంధాలు పదాలుగా కుటుంబంగా సాగుతున్నాయి 
పదాలకు సంబంధాలు వాక్యాలుగా ఉమ్మడి కుటుంబంగా సాగుతున్నాయి 

వాక్యాలు (భాగాలుగా) పుటలుగా పాఠాలుగా సమాజంలో ఒక వీధిగా సాగుతున్నాయి 
వివిధ వాక్యాలు పాఠాలతో పరిచయాలుగా విషయ విశ్లేషణగా ఒక సమాజంగా సాగుతున్నాయి 

వివిధ పాఠాలు పుస్తకంలా జ్ఞాన పరిశోధనంలా అనుభవాలుగా ఒక గ్రామంలా సాగుతున్నాయి 
వివిధ పుస్తకాలు శాస్త్రీయ విజ్ఞాన శాస్త్రజ్ఞ సిద్ధాంతాలుగా జీవన మార్గాలుగా గ్రామంలో సాగుతున్నాయి 

వివిధ శాస్త్రీయ సిద్ధాంతాలు అమూల్యమైన అపారమైన అఖండమైన దైవ జ్ఞానంగా నగరంలో సాగుతున్నాయి 
వివిధ దైవ జ్ఞాన శాస్త్ర సిద్ధాంతాలు మంత్ర యంత్రములుగా భాషా పరిజ్ఞానంగా నగరంలో వివిధ సంస్థలలో సాగుతున్నాయి 
 
వివిధ దైవ జ్ఞాన యంత్ర భాష విధానములు కొత్త కొత్త ఉత్పత్తులతో దేశ విదేశ ప్రాంతాలుగా ప్రపంచమంతా సాగుతున్నాయి 
(దైవ జ్ఞానం - యంత్ర జ్ఞానం - భావ తత్వాల స్పర్శతో స్పందించే నిర్జీవ అణువుల జ్ఞానం - అపురూపమైన నిర్జీవ శాస్త్రీయ సిద్ధాంతం)


-- వివరణ ఇంకా ఉంది!

No comments:

Post a Comment