విజ్ఞానాన్ని తెలుసుకోవడానికి మార్గం ఎలా ఉంటుందో ఐశ్వర్యాన్ని పొందుటకు కూడా మార్గం ఉంటుంది
విజ్ఞానం విద్యాలయాల నుండి మొదలు పెడితే విశ్వ కళాశాలల వరకు అలాగే పరిశోధన కేంద్రాల వరకు వెళ్ళవచ్చు
ఐశ్వర్యం చిన్న సంస్థల నుండి విశ్వ విఖ్యాత పరిశ్రమల వరకు అలాగే వ్యాపార ఉత్పత్తుల యాజమాన్యం వరకు వెళ్ళవచ్చు
విజ్ఞానం - పాఠాల అర్థాలను గ్రహించి జ్ఞాపకాలతో అవగాహన చేసుకొని వాటి భావాలను తెలుసుకొని నేర్చుకోవాలి పరమార్థాన్ని అవగాహనతో మేధస్సులో ఉంచుకోవాలి అవసరానికి గుర్తు చేసుకొని తెలియజేసుకోవాలి సారాంశాన్ని వివరించాలి ప్రశ్నకు సమాధానం అర్థమయ్యేలా విశదీకరించాలి వివిధ ప్రయోగాలతో ప్రయోగశాల నుండి కూడా మన నేర్పరి తనాన్ని ఋజువు చేసుకోవాలి
ఐశ్వర్యం - జ్ఞానంతో ప్రశ్నను లేదా సమస్యను అవగాహన చేసుకొని కార్య ప్రక్రియల పద్ధతిని గమనిస్తూ అలాగే జరిగేలా చూసుకోవాలి వివిధ మార్పులతో మెరుగైన విధంగా మార్పు చేసుకొని ఉన్నతమైన ఫలితాన్ని అందించాలి
భవిష్య కాలానికి కావలసిన సౌకర్యములకు అనుగుణంగా మార్పులను చేసే అవగాహన అనుభవం ఆలోచన విధానం మేధస్సులో పరిశోధన పూర్వకంగా ఉండాలి అలాగే సాగిస్తూ ఫలితాన్ని అందించాలి
యంత్రములు కార్యాచరణ ప్రక్రియ విధానం తెలుసుకోవాలి అలాగే యంత్రముల నుండి ఆటంకములు కలగకుండా తగిన జాగ్రత్తలు వహించాలి
యంత్రముల పని తీరులో ఇబ్బందులు కలిగినా యంత్ర మరమత్తు విధానం కూడా తెలియాలి
కార్యముల పని తీరులో విజ్ఞానంతో పాటు ఆధునిక యంత్ర పరిశోధనల అవగాహన మెరుగైన విధంగా వివిధ రకాలుగా ఉన్నతంగా ఉండాలి
కార్య ప్రక్రియల విధానాలను వివిధ మార్పుల పరిశోధనల అనుభవాలను ఇతరులకు వివరంగా అర్థంగా వివరిస్తూ వారిని కార్యాలను సాగించే విధంగా శిక్షణలు ఇవ్వాలి యంత్ర విజ్ఞానాన్ని అందించాలి
రాబోయే తరాలకు శిక్షణలు ఇస్తూ కార్యాలను భవిష్యత్తుకు అనుగుణంగా వివిధ మార్పులతో సాగించాలి
విజ్ఞానం ఐశ్వర్యంతో పాటు బంధాల కుటుంబాలను సమాజాన్ని మెరుగైన విధంగా నడిపించాలి
ప్రకృతిని పరిశుద్ధంగా అభివృద్ధి చేయాలి అందరికి అన్నీ తగిన ధరలకు అందుబాటులో ఉండాలి అందరు అభివృద్ధి చెందాలి
సంతోషాల ఉత్సవాలను విజయాలను మితంగా పరిమితంగా పరిశుభ్రతతో పొదుపుగా జాగ్రత్తగా జరుపుకోవాలి జీవితాన్ని ఆరోగ్యంతో జీవన శ్రమతో లక్ష్యంగా సాధనతో సాధిస్తూ సాగించాలి రేపటి తరానికి మార్గదర్శకంగా ఉండాలి
-- వివరణ ఇంకా ఉంది!
No comments:
Post a Comment