Friday, November 14, 2025

విశ్వ ప్రకృతిలో సృష్టించినదంతా మానవుడే ఉపయోగించుకుంటున్నాడు

విశ్వ ప్రకృతిలో సృష్టించినదంతా మానవుడే ఉపయోగించుకుంటున్నాడు  
భూమి నుండి ఆకాశం పాతాళం నుండి అంతరిక్షం మానవుడే అనుభవిస్తున్నాడు 

విశ్వంలో కనిపించే వాటిని అన్నింటిని తన జ్ఞానేంద్రియాల అవగాహనతో పరిశోధిస్తూ ఉపయోగించుకుంటున్నాడు 
విశ్వంలో కనిపించే కొన్ని జీవులను కూడా తనకు నచ్చిన విధంగా వివిధ ప్రయోగాలతో మానవుడు ఉపయోగించుకుంటున్నాడు 

మానవుని విజ్ఞానం కనిపించే వాటిని గురించి తెలుసుకోవడం సేకరించడం ఉపయోగించడం అనుభవించడం అవసరమైతే వృధా చేయడం 

మానవుడు ఎన్ని తెలుసుకున్నా విశ్వ ప్రకృతిలో ఇంకా ఎన్నో తెలియని అనంతమైన విషయాలు శాస్త్రీయములు సిద్ధాంతాలు వివిధ అణువు పరమాణువుల భావ తత్వాలతో సాగే వివిధ ప్రక్రియలు వివిధ రూపాకారాలతో జగమంతా బ్రంహాండమంతా విశాల ప్రదేశమై నిండుకున్నాయి 

ఇతర జీవులు ఉన్నది ఉన్నట్లుగా సహజమైన మార్పులతో భూ ప్రదేశాన్ని ఉపయోగించుకుంటున్నాయి 

-- వివరణ ఇంకా ఉంది!


No comments:

Post a Comment