Thursday, November 20, 2025

అద్దం ప్రస్తుతం ఉన్నదానిని మాత్రమే దాచుకోకుండా ఎటువంటి భావ తత్వాలను వ్యక్తపఱచకుండా చూపిస్తుంది

అద్దం ప్రస్తుతం ఉన్నదానిని మాత్రమే దాచుకోకుండా ఎటువంటి భావ తత్వాలను వ్యక్తపఱచకుండా చూపిస్తుంది (ఉన్నది ఉన్నట్లుగా ఎటువంటి మార్పు బేధం లేకుండా అందరికి ఒకేలా చూపిస్తుంది)

పాత దానిని ఎప్పటికప్పుడు తక్షణమే వదిలేస్తుంది కొత్తదనం వచ్చే దాకా ఉన్నదానితో నిండుగా సంతృప్తి చెందుతుంది  (తన ముందు ఏ సూక్ష్మమైన మార్పు జరిగినా అలాగే ఉన్నది ఉన్నట్లుగా చూపిస్తుంది - తనను చూసే వారికి కూడా తెలుపకుండా మౌనమై నిశ్చలమై ఉండిపోతుంది)

నీవు ఎలా ఉంటే అలాగే నిన్ను చూపిస్తుంది తప్ప ఎటువంటి భావ స్వభావ తత్వాలను తెలియబరచుకోదు 
తనకు తానుగా ఎదుట ఉన్న దానిని నిరంతరం చూస్తూ చూపిస్తూ కదలకుండా తాను ఉన్నానని తెలియనట్లు నిలిపోతుంది ఉండిపోతుంది 

ప్రతి రోజు తన ఎదుట ఉన్నవారు లేక వచ్చిన వారిని శరీరంపై గమనం కలిగేలా చక్కగా మార్పు చేసుకునేలా అందంగా (శుభ్రంగా) కనిపించేలా సరి చేసుకునేందుకు ఉపయోగపడుతుంది తప్ప సహాయం చేయలేకపోతున్నది 

అద్ధం తన ధర్మాన్ని యాదార్థంగా పాఠిస్తుందని తెలుస్తున్నది 

ఎవరి ధర్మం వారిదే ఎవరి భావ తత్వాలు వారివే - ఏది ఎలా ఉన్నా జీవించుటలో ఇతరులకు ప్రయోజనకరంగా ఉండాలి 

విశ్వంలో ఉద్భవించిన ప్రతి అణువు మానవ విజ్ఞాన మేధస్సును పరిశోధనం చేస్తున్నది ఉపయోగకరంగా ఆలోచింపజేస్తున్నది విజ్ఞానాన్ని సేకరిస్తున్నది 

-- వివరణ ఇంకా ఉంది!

No comments:

Post a Comment