Monday, November 3, 2025

యుద్ధాన్ని చూసేవారు భయపడతారు వింటున్నవారు అదిరిపోతారు

యుద్ధాన్ని చూసేవారు భయపడతారు  వింటున్నవారు అదిరిపోతారు  

యుద్ధాన్ని దూరం నుండి చూసేవారు భయపడతారు దూరం నుండి వింటున్నవారు అదిరిపోతారు

యుద్ధం మానవుల వికృత రూపాల ధైర్య సహాసాల సమర భీకర విషాద ప్రమాద తతంగ పోరాటం 

విజ్ఞాన సంభాషణల పరిష్కారాలు ఇరువైపుల వారికి (ఇరు ప్రదేశాల వారికి ) లేనప్పుడే లేదా పరిష్కారాలు సమావృద్ధిగా (సమృద్ధిగా) లేనప్పుడే యుద్ధాలు చేసేందుకు సిద్ధపడతారు 

యుద్ధానికి శరీరంతో పాటు అన్నీ ఆయుధములవుతాయి పోరాడే వ్యక్తికీ ఎదురుగా ఉన్నవారు శత్రువులుగా కనిపిస్తే చాలు మరణం ఎలా సంభవిస్తుందో మేధస్సుకే కాదు యుద్ధానికి కూడా తెలియకుండా పోతుంది 

యుద్ధం తర్వాత ఆలోచించే వారు దేనిని తిరిగి పొందలేరు ప్రశాంతతను పొందలేరు గౌరవమైన పరిచయాన్ని పొందలేరు తాను గొప్పవాడని చెప్పుకోలేడు (యుద్ధానికి ముందు యుద్ధాన్ని ఆపగలిగితే అతను గొప్పవాడని ప్రజలే చెప్పగలరు)

యుద్ధ ప్రదేశాన్ని సందర్శించిన వారు తిరిగి ప్రశాంతంగా రాలేరు మేధస్సును సమయోచితంగా ఉంచుకోలేరు  సంభోజనం చేయలేరు తాను ఒక వీరుడైనా బంధాన్ని మరిచిపోలేడు 

యుద్ధంలో గెలిచిన వారికంటే యుద్ధంలో కోల్పోయిన వారి బంధువులు జీవితాన్ని ఎలా గడపాలో మొదటి నుండి శూన్య స్థితి నుండి శ్రమించగలగాలి (నిలిచేందుకు శక్తి ఆలోచించుటకు ఆలోచన ఉండుటకు వసతి ఆకలికి ఆహారం మాటకు మనుషులు ప్రయాణానికి మార్గం నిద్రించుటకు ప్రదేశం కాలకృత్యములకు మనుగడ ఉండదు) ఏ ప్రదేశానికి ఎలా వెళ్ళాలో తెలియదు ఉన్న చోట ఉండాలో కూడా ఆలోచనకు లేదు 

యుద్ధంలో ప్రమాదానికి గురై శరీర భాగాలు విరిగిపోయి గాయమై చెడిపోయినా జీవితాన్ని సాగించుటలో పరమార్థం పరమాత్మకు కూడా తెలియదు ఆరోగ్యానికి కూడా అర్థం తెలియదు 

-- వివరణ ఇంకా ఉంది!

No comments:

Post a Comment