జరిగేవన్నీ జరిగిపోతూనే జరగలేనట్లు జరిగిపోతున్నాయి
కార్యములు ఎవరివో తెలియని వారివి ఐతే జరగలేనట్లు తోస్తాయి
కార్యములు మనవే మన వారివి ఐతే కార్యములు జరుగుతున్నట్లు తెలుస్తాయి కనబడుతాయి
కాలం సాగే కొద్దీ కొంత కాలాన ఏ కార్యములైనా ఎవరి కార్యాలైనా జరగలేనట్లు అనిపిస్తాయి
జరిగే కార్యములను గమిస్తూ జాగ్రత్త వహిస్తూ ప్రమాదాలను తొలగించేందుకు గొప్పగా ప్రయత్నించాలి రక్షణతో సాగించాలి
జరిగే కార్యములను మనకు అనుగుణంగా అనుకూలంగా విజ్ఞానంగా పరిశుద్ధంగా ఆరోగ్యంగా అభివృద్ధి కలిగేలా సాగించాలి
ప్రతి విషయాన్ని గమనించాలి ప్రతి కార్యాన్ని రక్షణతో వివిధ జాగ్రత్తలతో వివేకవంతంతో సాగించాలి
-- వివరణ ఇంకా ఉంది!
No comments:
Post a Comment