పర ఆలోచనలతో కార్యాలను సాగించవద్దు సహ ఆలోచనలతో కార్యాలను సాగించు
పర ఆలోచనలు పర ధ్యాసను కలిగిస్తూ ప్రస్తుత కార్యాల పని తీరును మార్చేస్తూ ప్రమాదాన్ని కలిగిస్తాయి
సహ ఆలోచనలు సహ ధ్యాసతో ప్రస్తుత కార్యాలపై అవగాహన ఏకాగ్రతను కలిగిస్తూ సమాధానాన్ని ఇస్తాయి
సహ ఆలోచన సమాధానం లాంటిది - సామర్థ్యాన్ని పెంచుతుంది
పర ఆలోచన ప్రమాదం లాంటిది - సామర్థ్యాన్ని తగ్గిస్తుంది
పర ఆలోచనలు దృష్టిని మార్చేస్తాయి
సహ ఆలోచనలు దృష్టిని కేంద్రీకరిస్తాయి
సహ ఆలోచన విజయాన్ని కలిగిస్తుంది
పర ఆలోచన పరాజయాన్ని అందిస్తుంది
పర ఆలోచన ఇతరులది - ఇతరుల కార్యాలపై దృష్టిని మళ్ళిస్తుంది [కనిపించే ఇతర దృశ్యాలపై ధ్యాసను మళ్ళిస్తుంది]
సహ ఆలోచన నీది - నీ కార్యాలను సాగిస్తుంది సాధనగా మార్చుకుంటూ సాధిస్తుంది [నీ కార్యాలపై సహనాన్ని సామర్థ్యాన్ని పెంచుతుంది]
ఏ కార్యంలో ఏ పర ధ్యాస ఎప్పుడు కలిగినా చేసే కార్యంలో ఏకాగ్రత అవగాహన ఎరుక జాగ్రత్త కలిగివుండాలి కార్యం ఫలించే వరకు హెచ్చరింపుతో ఉండాలి
-- వివరణ ఇంకా ఉంది!
No comments:
Post a Comment