Saturday, March 29, 2025

ఉచ్చ్వాస ఎక్కడో ఇరుక్కుపోతున్నది శ్వాస ప్రయాసతో ఊపిరి ఉక్కిరిబిక్కిరి అవుతున్నది

ఉచ్చ్వాస ఎక్కడో ఇరుక్కుపోతున్నది శ్వాస ప్రయాసతో ఊపిరి ఉక్కిరిబిక్కిరి అవుతున్నది 

శ్వాస నాళంలో ఉచ్చ్వాస నిర్బంధమైపోయి పొడవైన సంపూర్ణ ఉచ్చ్వాస కలగకుండా మధ్యలోనే ఆగిపోతుంది  

ఎక్కువగా శ్రమించడం వల్ల లేదా సరిగ్గా సరైన ప్రకృతి పోషక ఆహారాన్ని సరైన సమయానికి సమపాళలో తీసుకోకపోవడం వల్ల సరైన నిద్ర లేకపోవడం వల్ల సరైన వ్యాయామం లేదా యోగాసన అభ్యాసం లేకపోవడం వల్ల సరైన విధంగా నీటిని త్రాగలేక పోవడం వల్ల శ్వాసలో అనేక ఇబ్బందులు కలుగుతుంటాయి 

నిత్యం ప్రశాంతమైన పొడవైన ఉచ్చ్వాస నిచ్ఛ్వాస ప్రయాస ప్రవాహం శ్వాస నాళంలో ప్రతిసారి సమపాళలో కలుగుతూ ఉండాలి 

ఒక్కసారి ఉచ్చ్వాస ఆగిపోయినా ఒక్కసారి హృదయం ఒక్క క్షణం నిలిచిపోయిన [ధ్వనించకపోయినా] శ్వాస ప్రయాసతో జీవం తల్లడిల్లై పోతుంది 

ఒక్కసారి శరీరం నిశ్చలమైతే నీ కార్యాలు విజ్ఞానం భవిష్య బాధ్యతలు బంధాలు కుటుంబం అల్లకల్లోలమై పోతుంది 

శ్వాసపై గమనం [ధ్యాస - ముఖ్యంగా శ్రమించడంలో] పెడుతూ ప్రశాంతమైన ఉచ్చ్వాస నిచ్చ్వాసాలకై ఊపిరికి సంపూర్ణ ప్రయాస కలిగేలా సామర్థ్యాన్ని చేకూర్చు [కలిగించు]


-- వివరణ ఇంకా ఉంది!

No comments:

Post a Comment