Saturday, March 22, 2025

నీవు జీవించుటలో కలిగే పరిస్థితులకు ఎలా స్పందించే ఏ కార్యాలతో ముందుకు సాగుతావో అలాగే నీ జీవితం ఏర్పడుతుంది

నీవు జీవించుటలో కలిగే పరిస్థితులకు ఎలా స్పందించే ఏ కార్యాలతో ముందుకు సాగుతావో అలాగే నీ జీవితం ఏర్పడుతుంది  

నీ కార్యాలకు అనుకూలించిన సమయ సందర్భాల కార్య ఫలితాలు వివిధ మలుపులతో నీ జీవిత విధానం సాగుతూపోతోంది 

నీ చుట్టూ ఉన్నా సమాజం స్నేహితులు విజ్ఞానం వివిధ జీవుల విధానాలు వివిధ బంధాల సంబంధాలు వివిధ కార్యాల ప్రయాణాలు వివిధ పరిస్థితుల ప్రభావాలు అన్నీ నీ జీవితాన్ని ఒక విధంగా సాగిస్తాయి అలాగే మార్చేస్తాయి 

నీ లక్ష్యానికి నీవు పరిస్థితులను అనుగుణంగా మార్చుకుని అపారమైన సాధనను సాగిస్తూ విజయ జీవితాన్ని అందుకోవాలి 

జీవితంలో ఎదగాలి అందుకు శ్రమించాలి శ్రమించుటలో విశ్రాంతి పొందాలి అలాగే ఆరోగ్యం ఐశ్వరం ప్రశాంతత అనుబంధం విజ్ఞానం అన్ని సమకూర్చుకోవాలి 

నీవు ఎదుగుటలో భావ తత్వాలను అదుపులో ఉంచుకొని విజ్ఞానంగా ప్రశాంతంగా సమన్వయంగా నడుచుకోవాలి గౌరవాన్ని పొందాలి 


-- వివరణ ఇంకా ఉంది!

No comments:

Post a Comment