Saturday, March 22, 2025

ప్రకృతిలో ప్రతీది ప్రతి జీవికి ఉచితమే

ప్రకృతిలో ప్రతీది ప్రతి జీవికి ఉచితమే 

ప్రకృతిలో ఉన్న దానిని జీవులన్నీ జీవించుటకు ఆహారంగా రక్షణగా విహార ప్రయాణంగా ఉపయోగించుకోవచ్చు వాడుకోవచ్చు  

ఎల్లపుడు మానవులకు తప్ప ఇతర జీవులకు ప్రకృతి ఉచితంగానే లభిస్తున్నది అలాగే వాడుకుంటున్నాయి 

ప్రకృతి ప్రతి రోజూ కాల వాతావరణంతో పరిశుద్ధంగా అభివృద్ధి చెందుతూ ప్రతి జీవికి ఆహారంగా సౌకర్యంగా స్వచ్ఛమైన ప్రాణవాయువును అందిస్తున్నది 

ప్రకృతి నుండి మనం సంపాదించుకున్నది మన వాళ్ళకు సమానంగా పంచకుండా అనుభవిస్తున్నాము ప్రకృతి ధర్మాన్ని పాఠించలేక పోతున్నాము వెళ్ళేటప్పుడు దేనిని తీసుకోలేక ప్రకృతి లోనే పంచభూతాలుగా పోతున్నాము 

మన వాళ్ళకు మనం సమానంగా పంచలేక మన తరాల వారికి ఇవ్వాలన్నా ఆశతో జీవిస్తున్నాము 

ప్రకృతి ధర్మాన్ని ప్రకృతి న్యాయాన్ని ప్రకృతి ప్రశాంతతను పంచుకుంటూ ప్రకృతిని పరిశుద్ధంగా అభివృద్ధి చేసుకోవాలి సమానంగా పంచుకోవాలి ఆరోగ్యంగా దీర్ఘ కాలంతో బంధాలతో జీవించాలి ప్రకృతి విజ్ఞానాన్ని అవగాహన చేసుకుంటూ పరమార్థాన్ని గ్రహించాలి  


-- వివరణ ఇంకా ఉంది!

No comments:

Post a Comment